NLG: దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఈ రోజు పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. కొండమల్లేపల్లి, దేవరకొండ, డిండి, చింతపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు, వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.