BDK: రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారులను కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు అభినందించారు. హైదరాబాదు ఓయూలో జరిగిన ఈ క్రీడల్లో కొత్తగూడెంకి చెందిన క్రీడాకారులు విజయం సాధించడం హర్షణీయం అని అన్నారు. డిస్క్ త్రో విభాగంలో వందన, జావలిన్ త్రోలో వేదశ్రీ, షార్ట్ పుట్ విభాగంలో దీక్షిత్ మెడల్ సాధించారు.