»Two Officials Who Went To Tirumala Along With The Minister Srinivas Goud Ec Suspended
EC suspended: మంత్రితో పాటు తిరుమలకు వెళ్లిన ఇద్దరు అధికారులు సస్పెండ్..ఈసీ ఆదేశాలు
తెలంగాణలో ఎన్నికల వేళ మంత్రితోపాటు తిరుమలకు వెళ్లినందుకు ఇద్దరు అధికారులను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుతం మహబూబ్ నగర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.
Two officials who went to Tirumala along with the minister srinivas goud EC suspended
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ మనోహర్ రావు, ఆయన ఓఎస్డీగా పనిచేస్తున్న రిటైర్డ్ అధికారి సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి BRS అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్టోబరు 15, 16 తేదీల్లో తిరుమలకు వెళ్లారు. మంత్రితో పాటు ఎండీ మనోహర్ రావు, ఆయన ఓఎస్డీ సత్యనారాయణ కూడా తిరుమలలో కనిపించారు. వీరిద్దరిపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు.
తెలంగాణ సీఈవో నివేదిక ఆధారంగా ఇద్దరు అధికారులు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో ఉల్లంఘించారని ఈసీ నిర్ధారించింది. దీంతో ఎండీ మనోహర్ రావును సస్పెండ్ చేశారు. ఎంసీసీ (MCC) నిబంధనలను ఉల్లంఘించినందుకు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓఎస్డీ సత్యనారాయణను విధుల నుంచి తప్పించారు. ఇద్దరు అధికారుల కోడ్ ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలని టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఈసీ ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంపై తీసుకున్న చర్యలను ఈ నెల 19న మూడు గంటల్లోగా నివేదించాలని ఈసీ నోటీసులో పేర్కొంది. అతని స్థానంలో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ సత్యనారాయణను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి నియమించింది.
ఇద్దరు అధికారులు మంత్రితో కలిసి ఉన్నట్లు ఆరోపణలు వచ్చినందున నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. అయితే అక్టోబర్ 9 నుంచి తెలంగాణలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్‌పై శ్రీనివాస్ గౌడ్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు అనుకూలంగా పనిచేయకూడదు. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి.