తెలంగాణ(Telangana)లో ఎన్నికల కోడ్ రావడంతో పోలీసు శాఖ అలర్ట్ అయింది. తాజాగా సీపీ సీవీ ఆనంద్ రాజకీయ నేతలకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.వెపన్స్(Weapons) డిపాజిట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 16 లోపు పీఎస్ లలో వెపన్స్ డిపాజిట్ చేయాలని ఆదేశించారు.లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. డిసెంబర్ 10 తర్వాత డిపాజిట్ చేసిన వెపన్స్ తీసుకోవచ్చని సీపీ సీవీ ఆనంద్ (CV Anand) వెల్లడించారు
ఎన్నికల కోడ్ (Election Code)నేపథ్యంలో ఆన్ లైన్ డబ్బుల పంపిణీ, ట్రాన్స్ ఫర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. బ్యాంక్ సహాయం తీసుకుని డిజిటల్ పేమెంట్స్(Digital payments)పై ఆరా తీస్తామన్నారు. రౌడీలు, గుండాలపై ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకుంటామన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అక్రమ డబ్బు, మద్యం సరఫరా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. 1587 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల(Polling stations)ను గుర్తించామని, 32 కేంద్ర బలగాల భద్రతకు అవసరం ఉందన్నారు.
గతంలో జరిగిన ఘర్షణలు, గొడవల నేపథ్యంలో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, మద్యం, డబ్బు రవాణా, పంపిణీని పర్యవేక్షించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. 2252 నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయని, 652 బైండోవర్, పీడీ యాక్టు 18మంది, 15 నియోజకవర్గాల్లో 15 మంది పోలీసు ఉన్నతాధికారులతో నోడల్ అధికారులు, ఆర్బీఐ(RBI), స్థానిక బ్యాంకుల సహకారంతో డిజిటల్ పేమెంట్లపై ఫోకస్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీ బందోబస్తు నిర్వహిస్తామని, తనిఖీలతో తలెత్తే ట్రాఫిక్ నియంత్రించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.