ఐఐటీ కాన్పూరు (IIT Kanpur) విద్యార్థులు ముష్టి యుద్దన్నికి దిగారు.వార్షిక క్రీడా వారోత్సవంలో జరిగిన కబడ్డీ పోటీలో ఈ ఘటన జరిగింది. వైఎంసీఏ(YMCA)-ఎన్ఎస్యూటీ జట్ల మధ్య ఘర్షణ చొటుచేసుకుంది. దీంతో విద్యార్థులు (Students) చితక్కొట్టేసుకున్నారు.ఒకరిపై ఒకరు పిడికి గుద్దులు కురిపించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ (Video viral) అవుతోంది.పోట్లాటకు దిగిన రెండు జట్లు కాన్పూరు వెలుపలివి కావడం గమనార్హం. ఈ గొడవ తర్వాత రెండు జట్లపై అనర్హత వేటు వేశారు. ఈ ఘటనపై ఐఐటీ కాన్పూరు అధికారికంగా ఇప్పటి వరకు క్లారీటీ ఇవ్వలేదు. ప్లేయర్లు ఒకరిపై ఒకరు పడి కుమ్మేసుకున్నారు. కుర్చీలతో చావబాదుకున్నారు. కారణం తెలియ లేదు.ఆ వీడియోలో రెండు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తన్నుకోవడం, కొందరు ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకోవడం కనిపిస్తుంది. అయితే, గొడవ పడిన రెండు కబడ్డీ జట్లను ప్రస్తుతం స్పోర్ట్స్ మీట్‌కు అనర్హులుగా ప్రకటించారు. ఈ ఘటనపై ఐఐటీ కాన్పూర్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.