Congress First List Release Tomorrow With 58 Names
Alliance Confirm: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీతో కమ్యునిస్టుల పొత్తు ఖరారు (Alliance Confirm) అయ్యింది. మునుగోడు బై పోల్ సమయంలో కమ్యునిస్టులతో కలిసి నడిచిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఆ తర్వాత సైలంట్ అయ్యారు. ఈ సారి పొత్తు వద్దంటూ సంకేతాలు ఇచ్చారు. కేసీఆర్ తమను వాడుకొని వదిలేశారని కామ్రెడ్ నేతలు ఘాటుగానే స్పందించారు. దీంతో ఈ సారి కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలని నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 117 స్థానాలు ఉన్నాయి. వాటిలో కాంగ్రెస్ పార్టీ (congress) కమ్యూనిస్టులకు 4 సీట్లను ఖరారు చేసింది. సీపీఐకి కొత్తగూడం, మునుగోడు కేటాయించగా.. సీపీఎంకు భద్రాచలం, మిర్యాలగూడ స్థానాలను కేటాయించింది. ఈ చోట్ల కమ్యునిస్టులు బలంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి టగ్ ఆఫ్ వార్ ఇస్తారు. అందుకే కాంగ్రెస్ పార్టీ దాదాపు అడిగిన సీట్లను ఖరారు చేసింది.
మిగతా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు బరిలోకి దిగుతారు. ఆయా చోట్ల కమ్యునిస్టు పార్టీ నేతలు, శ్రేణులు హస్తం పార్టీ నేతలకు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ నాలుగు చోట్ల కాంగ్రెస్ క్యాడర్ కమ్యునిస్ట్ అభ్యర్థులకు మద్దతు తెలుపుతారు. టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర నేతలు కూడా ప్రచారం నిర్వహిస్తారని విశ్వసనీయ సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒంటరిగా బరిలోకి దిగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌తో గులాబీ బాస్ ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించి.. ముందడుగు వేశారు.