KCR Bhima- Prati Intiki Dhima kcr announce New Scheme
CM KCR: తెలంగాణ అసెంబ్లీకి ఈసీ షెడ్యూల్ విడుదల చేయడంతో ప్రధాన పార్టీల హడావిడి మొదలైంది. అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. ఈ నెల 15వ తేదీన సీఎం కేసీఆర్ (CM KCR) అభ్యర్థులతో సమావేశం అవుతారని తెలిసింది. ఆ రోజే అభ్యర్థులకు బీ ఫారాలు అందజేస్తారని సమాచారం. తర్వాత పార్టీ మేనిఫెస్టో ప్రకటిస్తారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. మరోసారి అధికారం ఇవ్వాలని.. హామీలను ఇస్తారు.
మేనిఫెస్టో ప్రకటించిన వెంటనే హుస్నాబాద్‌లో తొలి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. విపక్షాలను ఏకీపారేయడమే ప్రధాన లక్ష్యంగా కేసీఆర్ స్పీచ్ ఉండనుంది. 16వ తేదీన జనగామ, 17వ తేదీన సిద్దిపేట, సిరిసిల్ల, 18వ తేదీన జడ్చర్ల, మేడ్చల్, నవంబర్ 9వ తేదీన కామారెడ్డిలో బహిరంగ సభలు ఉంటాయి. ఆ సభల్లో కేసీఆర్ తనదైన శైలిలో విరుచుకుపడే అవకాశం ఉంది.
నవంబర్ 9వ తేదీన సీఎం కేసీఆర్ నామినేషన్ వేస్తారు. ఆ రోజు గజ్వేల్‌తోపాటు కామారెడ్డిలో కూడా నామినేషన్ ఫైల్ చేస్తారు. ముచ్చటగా మూడోసారి అధికారం చేపడుతామని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సారి తమ సీట్లు కూడా పెరుగుతాయని.. సెంచరీ కొడతామని అంటున్నారు.