»Oneplus Open Sale Now Price And Phone Features Officers
OnePlusOpen: సేల్ వచ్చేసింది..ప్రైస్ ఎంతంటే
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న OnePlus ఓపెన్ మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ సేల్ వచ్చేసింది. అమెజాన్, Reliance Digital సహా OnePlus అధికారిక వైబ్ సైట్లో ఈ ఫోన్ సేల్స్ ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఫోన్ ఫీచర్లు ఏంటి, ప్రస్తుతం ఎంత ధరకు అమ్ముతున్నారు? ఏమైనా డిస్కౌంట్ ఉందా అనే వివరాలు ఇప్పుడు చుద్దాం.
OnePlus Open Sale now price and phone features officers
OnePlusOpen ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ సేల్స్ నేటి నుంచి భారత్‌లో మొదలయ్యాయి. అమెజాన్, Reliance Digitalతోపాటు అధికారిక వైబ్ సైట్లో వీటిని సేల్ చేస్తున్నారు. ఈ ఫోన్ రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. ఎమరాల్డ్ డస్క్, వాయేజర్ బ్లాక్. OnePlus Open ఫోన్ పై ఈ సంస్థ అధికారిక వెబ్ సైట్లో 5 వేల రూపాయల తగ్గింపును ప్రకటించారు. ICICI, OneCard బ్యాంక్ క్రెడిట్ కార్డ్, EMIతో ₹5,000 వరకు తక్షణ తగ్గింపు పొందవచ్చని తెలిపారు. డిస్కౌంట్ తర్వాత ఇది రూ.134,999కు లభించనుంది. ఇక అమెజాన్‌లో దీని ధర రూ.1,39,999గా ఉంది.
OnePlus ఓపెన్ భారతదేశంలో స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC, లోపల, వెలుపల 2K డిస్ప్లేలు, 16GB వరకు RAM, 512GB స్టోరేజ్, 48MP+64MP+48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. మార్కెట్లోని ఇతర ఫోల్డబుల్స్‌తో పోలిస్తే ఇది కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్‌ను కూడా కలిగి ఉంది. OnePlus ఓపెన్‌లో రెండు AMOLED డిస్ప్లేలు ఉన్నాయి. అంతర్గత డిస్ప్లే 7.82 అంగుళాలు, 2K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2,800 nits గరిష్ట ప్రకాశం కలిగి ఉంది. బాహ్య ప్రదర్శన 6.31-అంగుళాల AMOLED స్క్రీన్, అదే రిజల్యూషన్, రిఫ్రెష్ రేట్‌తో సిరామిక్ గార్డ్ ద్వారా రక్షించబడుతుంది.
OnePlus Open Android 13తో వస్తుంది. Qualcomm Snapdragon 8 Gen 2 చిప్సెట్, 16GB LPDDR5X RAM, 512GB UFS 4.0 స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ను అందిస్తుంది. RAMని వర్చువల్‌గా అదనంగా 4/8/12GB వరకు పొడిగించవచ్చు. ఈ పరికరం 4,805mAh బ్యాటరీతో 80W ఛార్జర్‌తో వచ్చినప్పటికీ, 67W వరకు ఛార్జింగ్ వేగాన్ని సపోర్ట్ చేస్తుంది. అదనపు ఫీచర్లలో అలర్ట్ స్లైడర్, 5Gకి సపోర్ట్, Wi-Fi 7, బ్లూటూత్ 5.3, USB-C పోర్ట్, డాల్బీ అట్మాస్ సౌండ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్ వంటివి ఉన్నాయి.