X app: ఎక్స్ లో ఆడియో వీడియో కాల్స్..ఎలా యాక్టివేట్ చేయాలంటే?
సోషల్ మీడియా సంచలన యాప్ ఎక్స్ ఇప్పుడు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్స్ ప్లాట్‌ఫామ్‌ని ఎవ్రిథింగ్ యాప్‌గా మార్చటంలో భాగంగా ఆడియో, వీడియో కాల్స్ తీసుకొచ్చినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే ఆ సెట్టింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
X app: సోషల్ మీడియాలో ఎక్స్ యాప్‌కు విపరీతమైన ఆధారణ ఉంది. ఎలాన్ మస్క్ (Elon Musk) దీన్ని సొంతం చేసుకున్న తరువాత పేరు మార్చడంతో పాటు ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం వినియోగదారులకు గుడ్ న్యూస్ చెబుతూ సరికొత్త అప్డేట్ను అందించారు. ఇకపై ఎక్స్ ద్వారా ఆడియో, వీడియో కాల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని మస్క్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొన్నాడు. అలాగే ఈ ఫీచర్ల యక్టివేషన్కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కూడా ఆయన పంచుకున్నారు. అయితే ఇది అందరూ యూజర్లకు అందుబాటులో లేదు. ఇంకా కొన్ని దేశాల్లో ఈ ఫీచర్ గురించి చర్చలు జరుగుతున్నాయి.
ఎక్స్ ప్లాట్‌ఫామ్‌ని ఎవ్రిథింగ్ యాప్‌గా మార్చటం కోసం వాయిస్, వీడియో కాల్స్ ఫీచర్లను తీసుకురానున్నట్లు మస్క్ ఆగస్టులోనే ప్రకటించారు. ఈ ఫీచర్ సాయంతో ఫోన్ నంబర్ లేకుండానే ఎక్స్‌లో కాల్స్ మాట్లాడవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్, పీసీలు ఈ కాలింగ్ ఫీచర్ సపోర్ట్ చేస్తాయి. అయితే దీన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే ‘Settings’లోకి వెళ్లి ‘Privacy Safety’ ఆప్షన్‌పై క్లిక్ చేసి‘Direct Messages’ ఆప్షన్‌ను ఎంచుకుని ‘Enable Audio, Video Calling’ ఫీచర్‌ని ఎనేబల్ చేసుకోవాలి. అయితే దీనిపై కొన్ని దేశాల్లో అభ్యంతరాలు వెల్లువెత్తాయి. సెలబ్రెటీ స్టేటస్ ఉన్నవాళ్లు ఈ ఫీచర్‌తో ఇబ్బంది పడే అవకాశం ఉందని, దీన్ని మిస్ యూజ్ చేస్తారని కొన్ని దేశాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం ఇది కొందరికి మాత్రమే అందుబాటులో ఉంది. అది సక్సెస్ అయితే మిగతా వారికి వర్తింపజేస్తారని తెలుస్తోంది.