»Good News For Instagram Users Another Amazing Feature
Meta: ఇన్స్టాగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్.. మరో అద్భుతమైన ఫీచర్
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు రీల్స్‌కే పరిమితం అయిన ఈ ఆప్షన్ ఇప్పుడు కామెంట్ బాక్స్‌లో కూడా తీసుకురాబోతున్నారు.
Good news for Instagram users.. Another amazing feature
Meta: చేతులో స్మార్ట్ ఫోన్(SmartPhone) ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్స్టాగ్రామ్(Instagram) పరిచయమే. ఫోటోలు, వీడియోలు చూస్తూ అలా సమయాన్ని గడిపేస్తుంటారు. అంతే కాదు వ్యాపారానికి సంబంధించిన యాడ్స్, ఫిల్మ్ న్యూస్, పొలిటికల్ ఇలా ఒక్కటేంటి ఇన్స్టాగ్రామ్ ఉంటే చాలు ఎన్నో కొత్త విషయాలు తెలుసుకొవచ్చు. ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్ బర్గ్ మెటా(Meta)ను స్థాపించి ఇన్‌స్టాను తన సంస్థలో మెర్జ్ చేసుకున్న తరువాత దీనికి విపరీతమైన పాపులారిటీ వచ్చింది. అలాగే యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అందుకే ఇన్‌స్టా అంటే అందరి ఫేవరేట్ అయిపోయింది. తాజాగా మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుందని ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి తెలిపారు.
ఇన్స్టాగ్రామ్(Instagram)లోని కామెంట్ సెక్షన్‌ను ఆసక్తిగా మార్చాలని మెటా భావిస్తోంది. అందులో భాగంగా కామెంట్ సెక్షన్లో పోల్ నిర్వహించే ఫీచర్‌ని తీసుకురాబోతుంది. ఇప్పటివరకు కేవలం ఇన్‌స్టా స్టోరీల్లో మాత్రమే పోల్స్ నిర్వహించేందుకు అవకాశం ఉండేది. ఇకపై సాధారణ ఫోస్టులు, రీల్స్.. ఈ రెండింటి కామెంట్ సెక్షన్లలో పోల్స్ నిర్వహించవచ్చనమ్నాట. పోల్‌లో పాల్గొన్న వారి సంఖ్యను చూడొచ్చు. అయితే పోల్లు పోస్ట్ చేసిన తర్వాత ఎంతకాలం ఉంటాయనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలోనే ఉంది. త్వరలోనే అందుబాటులోకి రానుంది.