Amazon ఫైర్ టీవీలో ఇక ఏఐ, హోమ్స్ ఇక స్మార్ట్ హోమ్స్
అమెజాన్ ఫైర్ టీవీలో ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ రానుంది. మీ ఇళ్లను మరింత స్మార్ట్ హోమ్ చేసుకోవాలని కంపెనీ కోరుతుంది. త్వరలో ఇండియాలో కూడా ఏఐ ఫీచర్ రానుందని పేర్కొంది.
AI to Amazon Fire TV: అమెజాన్ (Amazon) ఫైర్ టీవీ స్టిక్ మరింత అప్ గ్రేట్ చేస్తున్నారు. ఫైర్ టీవీ ద్వారా ఇప్పటికే అమెజాన్ (Amazon) సేవలు అందిస్తోంది. యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, నెట్ ప్లిక్స్, డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ తదితర స్ట్రీమింగ్ యాప్స్ ప్లే అవుతున్నాయి. ఇప్పుడు అందులో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) చేరనుంది. దీనికి సంబంధించి అమెజాన్ (Amazon) ప్రకటన చేసింది.
ఫైర్ టీవీ ఓమ్నీ సిరీస్ మోడల్స్‌లో ఏఐ ఇన్ బిల్ట్ చేస్తామని కంపెనీ చెబుతోంది. మీరు క్షణాల్లో రిమోట్ కంట్రోల్ ద్వారా వాయిస్ కమాండ్ చేసి కళాకృతి (ఆర్ట్ వర్క్) చేయొచ్చని తెలిపింది. టీవీ చూసే సమయంలో టీవీ వాల్ ఆర్ట్‌గా పనిచేయాలని కోరుకుంటే ఫీచర్ ఉపయోగంగా ఉంటుంది. ఈ ఏడాది చివరలో ఫైర్ టీవీ ఓమ్నీ సిరీస్ మోడళ్లను ఎంచుకునేందుకు అవకాశం ఉంది.ఫైర్ టీవీ డివైజ్, ఫైర్ ఓఎస్ బేస్డ్ టీవీ మోడల్స్‌లో ఏఐ ఫీచర్స్ వస్తాయని.. త్వరలో ఇండియాలో కూడా అందుబాటులో ఉంటాయని అమెజాన్ ఎంటర్టైన్ మెంట్ డివైజ్ అండ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ డానియల్ రౌస్ తెలిపారు.
ఇంటిలో టీవీ అవసరం.. ఇంటి బయట అంతకుమించి సర్వీస్ ఇవ్వాల్సి ఉంటుంది. అలెక్సాను (Alexa) ఫైర్ టీవీ పొడక్ట్లో వాడుకోవచ్చు. స్మార్ట్ హోమ్‌గా (smart home) మార్చి వాయిస్ కమాండ్‌తో స్టేటస్ పెట్టుకోవచ్చని ఆయన చెబుతున్నారు. ఇప్పుడు డోర్ రింగ్ అయితే చూస్తోన్న మూవీని ఆపాల్సి ఉంటుంది. ఏఐ (AI) కనెక్ట్ అయితే డోర్ వద్ద ఎవరూ ఉన్నారో తెలుసుకునే వెసులుబాటు వస్తోందని చెప్పారు. కొన్ని సందర్భాల్లో యూనిక్ బండల్స్ విక్రయిస్తామని చెబుతున్నారు. వాటిలో ఫైర్ టీవీ, ఎకో డాట్ ఉంటాయన్నారు. దివాళి పండుగకు మరికొన్ని ఆఫర్స్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఇండియాలో (India) షావోమీతో కలిసి విక్రయాల చేస్తున్నామని.. సక్సెస్ మరికొన్ని కంపెనీలతో పనిచేసే విషయం ఆలోచిస్తామని చెబుతున్నారు.
కరోనా తర్వాత జనాలు ఎంటర్ టైన్మెంట్పై ఎక్కువగా ఫోకస్ చేశారని డానియల్ అంటున్నారు. ఒత్తిడిని దూరం చేసుకునేందుకు రిలాక్స్ అవుతున్నారని తెలిపారు. అందుకు అనుగుణంగా ఉత్పత్తుల తయారు చేస్తున్నామని చెబుతున్నారు.