»Good News For Gold And Silver Lovers Rs 1000 Decrease Silver And Gold 380 Decrease On June 15th 2023
Today gold silver rates: గోల్డ్, వెండి ప్రియులకు గుడ్ న్యూస్..వెయ్యి తగ్గింపు
దేశవ్యాప్తంగా ఈ రోజు(జూన్ 15న) బంగారం ధరలు దాదాపు 400 రూపాయలు తగ్గాయి. దీంతోపాటు వెండి రేట్లు కూడా దిగువకు చేరాయి. అయితే ఏయే నగరాల్లో ఎంత రేటు ఉందో ఇక్కడ చుద్దాం.
బులియన్ మార్కెట్(Bullion market)లో హెచ్చుతగ్గుల నేపథ్యంలో ఈరోజు(జూన్ 15న) బంగారం (Gold), వెండి ధరలు తగ్గాయి. ఈ నేపథ్యంలో దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర నిన్న రూ.54,700 ఉండగా.. ప్రస్తుతం రూ.55,050కు చేరింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్న రూ.59,670 ఉండగా..ఈరోజు రూ.60,050కి చేరింది. కాగా, కిలో వెండి ధర ఏకంగా వెయ్యి రూపాయలు తగ్గింది. నిన్న రూ.77,500 ఉండగా..ఈరోజు రూ.76,500కు చేరింది.
ఇక ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే దేశ రాజధాని ఢిల్లీ(Delhi) లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 61,020గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,940గా ఉంది. ముంబై (Mumbai) లో 24 క్యారెట్లు 60,860గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,790గా ఉంది. ఇక చెన్నై(Chennai) లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,520గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,390గా ఉంది.తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,860 పలుకుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,970 గా ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,860, అదేవిధంగా 22 క్యారెట్ల గోల్డ్ ధర 55,790గా ఉంది. విశాఖపట్టణంలో 24 క్యారెట్ల ధర రూ. 60,860 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 55790గా ఉంది.
ఇక ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి (24, 22 క్యారెట్ల ప్రకారం)
ఢిల్లీ రూ.60,200 రూ.55,200
హైదరాబాద్ రూ.60,050 రూ.55,050
విజయవాడ రూ.60,050 రూ.55,050
విశాఖపట్నం రూ.60,050 రూ.55,050
ముంబై రూ.60,050 రూ.55,050
మైసూర్ రూ.60,100 రూ.55,100
నాగ్పూర్ రూ.60,050 రూ.55,050
అహ్మదాబాద్ రూ.60,100 రూ.55,100
బెంగళూరు రూ.60,100 రూ.55,100
భోపాల్ రూ.52,200 రూ.47,850
భువనేశ్వర్ రూ.60,050 రూ.55,050
చండీగఢ్ రూ.60,200 రూ.55,200
చెన్నై రూ.52,285 రూ.47,927
కోయంబత్తూరు రూ.60,550 రూ.55,500
కేరళ రూ.60,050 రూ.55,050