కొంతకాలంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి భారత మాజీ దిగ్గజం రవిశాస్త్రి కీలక సూచన చేశాడు. స్పిన్ బౌలింగ్లో భయపడొద్దని, ఎదురుదాడికి దిగాలని సూచించాడు. అతను తన పాదాలను మరింత ఎక్కువగా ఉపయోగించాలని.. స్వీప్ షాట్లు ఆడాలని అన్నాడు. సమయానికి తగ్గట్లు కదులుతూ షాట్ ఆడటానికి భయపడొద్దని చెప్పాడు. బౌలర్లను భయపెట్టేలా ఎదురుదాడికి దిగాలని.. గతంలో కోహ్లీ అలానే ఆడేవాడని అన్నాడు.