వన్డే క్రికెట్లో ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇంగ్లాడ్‌తో జరుగుతున్న 5 వన్డేల సిరీస్‌లో ఆసీస్ వరుసగా రెండో విజయం సాధించింది. దీంతో వన్డేలలో ఆ జట్టుకు ఇది వరుసగా 14వ విజయం. దీంతో వన్డే క్రికెట్లో వరుసగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. కాగా 2003లో 21 వరుస విజయాలతో ఆస్ట్రేలియానే అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా రికార్డ్‌ను నమోదు చేసింది.