బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో స్టార్ స్పిన్నర్ అశ్విన్ పలు రికార్డులు బద్ధలు కొట్టాడు. అత్యధిక వికెట్ల జాబితాలో అశ్విన్ (522) 8వ స్థానంలో నిలిచాడు. అలాగే, టెస్టుల్లో అత్యధికంగా ఎక్కువ సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన బౌలర్ల జాబితాలో షేన్‌వార్న్‌తో కలిసి అశ్విన్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. మురళీ ధరన్ (67) టాప్‌లో ఉండగా.. అశ్విన్, షేన్ వార్న్ చెరో 37 సార్లు సాధించారు.