కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ట్రిన్ బాగో నైట్ రైడర్స్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్తో ఇవాళ జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన నైట్ రైడర్స్.. నికోలస్ పూరన్ 43 బంతుల్లో 93 పరుగులతో విధ్వంసం సృష్టించడంతో.. 18.3 ఓవర్లలోనే విజయం సాధించింది.