ఇటీవల జరిగిన భారత్-బంగ్లాదేశ్ టెస్టుకు మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అభినవ్ తొలిసారి ఇలాంటి పాత్ర పోషించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తన నానమ్మ చనిపోయి 24 గంటలు గడవకముందే మళ్లీ కామెంట్రీ చేసేందుకు వచ్చానని వెల్లడించారు. తన నిర్ణయంపై నాన్నమ్మ సంతోషంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.