టీ20 క్రికెట్(T20 Cricket) అంటే పరుగుల వర్షం కురవాలి. సిక్సుల మోత మోగాలి. ఫోర్లతో దద్దరిల్లిపోవాలి. ఇవన్నీ జరుగుతాయి కాబట్టే టీ20(T20) క్రికెట్ ను ఎక్కువ మంది చూడ్డానికి ఆసక్తి చూపుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. టీ20లోనే అత్యంత చెత్త రికార్డు నమోదైంది. ఓ జట్టు కేవలం 10 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
టీ20 క్రికెట్(T20 Cricket) అంటే పరుగుల వర్షం కురవాలి. సిక్సుల మోత మోగాలి. ఫోర్లతో దద్దరిల్లిపోవాలి. ఇవన్నీ జరుగుతాయి కాబట్టే టీ20(T20) క్రికెట్ ను ఎక్కువ మంది చూడ్డానికి ఆసక్తి చూపుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. టీ20లోనే అత్యంత చెత్త రికార్డు నమోదైంది. ఓ జట్టు కేవలం 10 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మరో జట్టు రెండు బంతుల్లోనే విజయం సాధించడం విశేషం. ఐల్ ఆఫ్ మ్యాన్, స్పెయిన్ జట్ట మధ్య టీ20 క్రికెట్ మ్యాచ్(T20 cricket match) జరుగుతోంది. ఈ అంతర్జాతీయ మ్యాచ్ లో చెత్త రికార్డు నమోదైంది.
మొదట బ్యాటింగ్(Batting) చేపట్టిన ఐల్ ఆఫ్ మ్యాన్ జట్టు 8.4 ఓవర్లలో 10 రన్స్ చేసి ఆలౌట్ అయ్యింది. ఈ జట్టులోని 7 మంది ఒక్క పరుగు కూడా చేయలేదు. మరో ముగ్గురు మాత్రం చెరో రెండు పరుగులు చేశారు. ఇకపోతే జోసెఫ్ బరోస్ అనే బ్యాటర్ 4 పరుగులు చేసి టాప్ స్కోరర్(Top scorer)గా నిలిచాడు.
ఆ తర్వాత 11 పరుగల విజయ లక్ష్యంతో స్పెయిన్ జట్టు బ్యాటింగ్(Batting) ప్రారంభించింది. ఈ జట్టు తొలి రెండు బంతుల్లోనే విజయం సాధించి రికార్డు నెలకొల్పింది. ఓపెనర్ అయిన అవైస్ అహ్మద్ రెండు బంతుల్లో రెండు సిక్సులు కొట్టాడు. టీ20 ప్రపంచ కప్(T20 World Cup)లో ఇది అత్యంత చెత్త రికార్డుగా నమోదైంది. అంతకుముందు బిగ్ బాష్ లీగ్ లో సిడ్నీ జట్టు(Sydney) 15 పరుగులు చేసింది. ఇప్పుడా రికార్డును ఐల్ ఆఫ్ మ్యాన్ టీమ్ బద్దలు కొట్టింది.
ఐల్ ఆఫ్ మ్యాన్ టీమ్ స్కోర్ బోర్డు:
A new world record today. The low T20 team score of 10 by Isle of Man against Spain. We are going to find this extremely hard to better in the Baltic Cup in August. pic.twitter.com/C1zAqUErhy