Womens T20 WC : మహిళల టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్గా ఆస్ట్రేలియా
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్(Womens T20 WC)లో మరోసారి ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆరోసారి టీ20 వరల్డ్ కప్(Womens T20 WC) ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. కేప్ టౌన్ లో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా(South aFrica)పై 19 రన్స్ తేడాతో ఆసీస్ విజయం(Australia Victory) సాధించింది.

దక్షిణాఫ్రికా(South aFrica) బ్యాటర్ లారా వొల్వార్డ్ 61 పరుగులు చేసినా లాభం లేకుండా పోయింది. సాధించాల్సిన రన్ రేటు 12పైనే ఉండటంతో దక్షిణాఫ్రికా(South aFrica) ప్లేయర్స్ ఒత్తిడికి గురయ్యారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసింది. అంతకు ముందు ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 156 పరుగులు చేసింది. బేత్ మూనీ 74 పరుగులతో చెలరేగిపోయింది. సొంత గడ్డపై వరల్డ్ కప్ గెలవాలనుకున్న దక్షిణాఫ్రికా(South aFrica)కు నిరాశే మిగిలింది. మొదటిసారి వరల్డ్ కప్ ఫైనల్ చేరినా లాభం లేకుండా పోయింది. ఆస్ట్రేలియా మహిళల జట్టు 6వ సారి టీ20 వరల్డ్ కప్ ను ముద్దాడింది. మొదటిసారి ఆ జట్టు 2010లో టీ20 ట్రోఫీని గెలువగా ఆ తర్వాత 2012, 2014లో వరల్డ్ కప్(World cup) ను సొంతం చేసుకుంది. 2018, 2020, 2023లో కూడా ఆస్ట్రేలియా వరల్డ్ కప్(World cup)ను గెలిచింది.