టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నాడు. తన ప్రియురాలు మిథాలీ పారుల్కర్ ను పెళ్లాడుతున్నాడు. వీరి వివాహం ఈ నెల 27న ముంబైలో జరగనుంది.
టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నాడు. తన ప్రియురాలు మిథాలీ పారుల్కర్ ను పెళ్లాడుతున్నాడు.
వీరి వివాహం ఈ నెల 27న ముంబైలో జరగనుంది. ఈ వివాహానికి కేవలం 250 మంది అతిథులు మాత్రమే హాజరుకానున్నారు.
పెళ్లికి రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న తరుణంలో పెళ్లి సందడి అప్పుడే మొదలైంది. ఇప్పటికే హల్దీ, మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి.
2021 నవంబర్ లో వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. వాస్తవానికి 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత వీరి వివాహం జరగాల్సి ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.