»Only One Person Is Allowed To Accompany The Patient In Gandhi
Gandhi hospital : గాంధీలో పేషంట్ వెంట ఒక్కరికే అనుమతి..
గాంధీ హాస్పిటల్ (Gandhi hospital) లో పేషంట్ వెంట వచ్చే బంధువులకు ఒకరు లేదా ఇద్దరికే అనుమతి ఇస్తామని సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు (Raja Rao) తెలిపారు. కొన్నిసార్లు వారిని చూడటానికి 6 నుంచి 10 మంది వరకు కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు రావడం, గేట్ల వద్ద సిబ్బందితో గొడవలకు దిగి దుర్భాషలాడటం, కొట్టడం లాంటి సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని ఆయన తెలిపారు.
గాంధీ హాస్పిటల్ (Gandhi hospital) లో పేషంట్ వెంట వచ్చే బంధువులకు ఒకరు లేదా ఇద్దరికే అనుమతి ఇస్తామని సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు (Raja Rao) తెలిపారు. కొన్నిసార్లు వారిని చూడటానికి 6 నుంచి 10 మంది వరకు కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు రావడం, గేట్ల వద్ద సిబ్బందితో గొడవలకు దిగి దుర్భాషలాడటం, కొట్టడం లాంటి సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని ఆయన తెలిపారు. కుటుంబ సభ్యులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తాము వారి పరిస్థితిని అర్థం చేసుకోగలమన్నారు. కానీ డాక్టర్లకు రోగిని పరిశీలించి వైద్యం అందించడానికి తగిన వాతావరణం ఉండాలని, వారు త్వరగా కోలుకునేందుకు సమయం ఇవ్వాలని ప్రజలను ఆయన కోరారు.
ముఖ్యంగా క్యాజువాలిటీ, ఐసీయూ, (ICU) పోస్ట్ ఆపరేటివ్ వార్డులు, ఎమర్జెన్సీ వార్డుల్లోకి పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో రోగులకు(Patients) ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని తమ సిబ్బంది వారికి చెబుతున్నా, వినిపించుకోవడం లేదన్నారు. ఇటీవల పలుమార్లు తమ సెక్యూరిటీ, పారిశుధ్య సిబ్బందిపై కొందరు రోగి బంధువులు దాడులకు పాల్పడ్డారని చెప్పారు. వారిపై చిలకలగూడ (Chilakalaguda) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఆర్ఎంఓ, (RMO) సీఎంఓ, సూపర్వైజర్లు నిరంతరం పర్యవేక్షిస్తుంటారని పేర్కొన్నారు. రోగులను సందర్శించడానికి సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య అనుమతి ఉన్నదని తెలిపారు. మిగతా సమయంలో అనుమతి ఉండదని, ప్రజలు ఇది గుర్తించాలని కోరారు.