»Three Students Died In A Road Accident In Chittoor District
Road accident : చిత్తూరు జిల్లాలో ఘెర రోడ్డు ప్రమాదం…ముగ్గురు విద్యార్థులు మృతి
చిత్తురు (Chittoor) జిల్లాలోని శెట్టిపల్లి సమీపంలో ఘెర రోడ్డు ప్రమాదం (road accident) చోటు చేసుకుంది. కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. శెగడిపల్లి మండలం గట్టిపల్లి వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.
చిత్తురు (Chittoor) జిల్లాలోని శెట్టిపల్లి సమీపంలో ఘెర రోడ్డు ప్రమాదం (road accident) చోటు చేసుకుంది. కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. శెగడిపల్లి మండలం గట్టిపల్లి వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వైద్య విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణంగా అనుమానిస్తున్నారు.
మృతులు కడప, నెల్లూరు వాసులుగా గుర్తించారు. మృతి చెందిన విద్యార్థులు కుప్పం (Kuppaṁ) పీఈఎస్ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ (MBBS)ఫైనల్ ఇయర్చ దువుతున్నారు.స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే పార్టీ (Birthday party)జరుపుకుని అనంతరం తిరిగి హాస్టల్ కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురు విద్యార్థుల మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను ఈపీఎస్ హాస్పిటల్లో (EPS Hospital) పనిచేస్తున్న డాక్టర్లు (Doctors) వికాస్, కళ్యాణ్, ప్రవీణ్‌గా గుర్తించారు. వారిలో ఇద్దరు కడప (Kadapa) జిల్లాకు, ఒకరు నెల్లూరు (Nellore) జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. ఈఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.