Virat Kohli: విరాట్ కొహ్లీ చికెన్ టిక్కా పోస్ట్ వైరల్
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి చికెన్ తింటున్నారని అభిమానులు షాక్ అవుతున్నారు. చాలా కాలం క్రితమే శాఖహారిగా మారాడు. ప్రస్తుతం ఆయన పెట్టిన మాక్ చికెన్ టిక్కా పోస్ట్ వైరల్ అయింది. అసలు విషయం తెలియక విరాట్ పోస్ట్ చూసి కొందరు షాక్ అవుతున్నారు.
Virat Kohli: ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) ఎంత ఫిట్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. స్పోర్ట్స్ పర్సన్ కావడంతో నాన్ వెజ్ తీసుకోకపోవడం ఓ కారణం కాగా.. అతని సతీమణీ అనుష్క శర్మ.. బ్రాహ్మిణ్, సో.. అందుకు కూడా ఆయన మాంసాహారం ముట్టరనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మాక్ చికెన్ టిక్కా తినడమే. అదేంటి కోహ్లీ మళ్లీ.. నాన్ వెజ్ తింటున్నారా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
మాక్ చికెన్ టిక్కా (mock chicken tikka)ను కచ్చితంగా ఇష్టపడుతారని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు. విరాట్ శాఖహారి అని విన్నాం కదా.. అని కొందరు అంటుంటే, ఒపినీయన్ మార్చుకున్నారేమో అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. వీరిందరికిి కౌంటర్‌గా మరో అభిమాని కామెంట్ పెట్టారు. అది చికెన్ కాదు అది మాక్ చికెన్ అని, దాన్ని సోయాతో తయారు చేస్తారని రాసుకొచ్చాడు. నిజానికి మాక్ చికెన్ టిక్కా అనేది రుచికరంగా ఉంటుందట. దాన్ని సోయాతో చికెన్ స్టైల్లో చేస్తారు. ఇది శాఖహారులకు ఎంతో ఇష్టమైన ఆహరం. రుచికిి కూడా చికెన్‌లానే ఉంటుంది. దీనిని బట్టి విరాట్ నాన్ వెజ్ తినలేదని తెలుస్తోంది. ఏదో సరదాగా ఆట పట్టించేందుకు అలా పోస్ట్ చేశారని అర్థం అవుతోంది.