»Virat Kohli Will Make A Century On His Birthday Pak Cricketer Mohammad Rizwan
Virat Kohli తన బర్త్ డే రోజు సెంచరీ చేస్తాడు.. పాక్ క్రికెటర్ మహమ్మద్ రిజ్వాన్
కోల్‌కతా ఈడెన్ గార్డెన్లో జరగబోయే భారత్-దక్షిణ ఆఫ్రికా మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడు అని పాక్ క్రికెటర్ మహ్మాద్ రిజ్వాన్ అన్నాడు. నవంబర్ 5 విరాట్ బర్త్‌డే మరింత ప్రత్యేకం కావాలని కోరుకున్నాడు. బెంగాల్ క్రికెట్ సంఘం 70 వేల కోహ్లీ ఫేస్ మాస్క్‌లను రెడీ చేస్తోంది.
Virat Kohli will make a century on his birthday.. Pak cricketer Mohammad Rizwan
Virat Kohli: వన్డే వరల్డ్ కప్‌లో(Worldcup2023) భారత్(Team india) సత్తా చాటుతోంది. ఆడినా ఆరు మ్యాచ్‌లతో వరుస విజయాలతో చరిత్ర తిరగరాస్తోంది. నవంబర్ 5న భారత్ తన 7వ మ్యాచ్ దక్షిణ ఆఫ్రికా(South Africa)తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అభిమానులకు ఎంతో ప్రత్యేకం, ఎందుకంగే ఆరోజు కింగ్ బర్త్ డే(Kohli Birthday). దీంతో కోహ్లీ సెంచరీ చేసి తన పుట్టిన రోజును మరింత ప్రత్యేకంగా చేస్తాడు అని ఆయన ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెటర్, వికెట్ కీపర్ మహ్మాద్ రిజ్వాన్(Mohammad Rizwan) చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. నవంబర్ 5న కోల్‌కతా ఈడెన్ గార్డెన్లో జరగబోయే ఆటలో విరాట్ సెంచరీ చేసి తన బర్త్ డేను మరింత ఉత్సహంగా జరుపుకుంటారు అని విష్ చేశాడు. ఇక వన్డే వరల్డ్ కప్‌లో 48 సెంచరీలు చేసిన ఆయన ఈ శతకంతో 49 పూర్తి చేస్తాడు అని, ప్రపంచకప్ ముగిసేలోగా అర్థ సెంచరీ పూర్తి చేస్తాడు అని రిజ్వాన్ పేర్కొన్నాడు.
ఆక్టోబర్ 31న ఈడెన్ గార్డెన్ వేదికగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఈ సందర్భంగా మహ్మాద్ రిజ్వాన్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడు అని అన్నారు. తనకు బర్త్‌డేలు జరుపుకోవడం ఇష్టం లేదని చెప్పారు. ఏది ఏమైనా కోహ్లీకి ఆ స్పెషల్ డే మరింత ప్రత్యేకంగా నిలువాలని కోరుకున్నాడు. ఈడెన్ గార్డెన్లో కింగ్ బర్త్ డే సెలబ్రేట్ చేసేందుకు బెంగాల్ క్రికెట్ సంఘం ప్రత్యేక ఏర్పాటు చేస్తోంది. 68 వేల మంది ఉండే స్టేడియంలో దాదాపు 70 వేల కోహ్లీ ఫేస్ మాస్క్‌లను తయారు చేసింది. మ్యాచ్ అనంతరం కేక్ కట్ చేయించి, గిఫ్ట్ ఇచ్చేలా ప్రణాళిక చేస్తున్నట్లు సమాచారం. ఈ స్పెషల్ మ్యాచ్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.