»Today Is The Final Of The Icc Womens T20 World Cup
T20 World Cup : నేడు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ సమరం
ప్రపంచ కప్ (World Cup) ట్రోఫీ కోసం జరిగే ఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా (Australia) నేడు సౌతాఫ్రికా(South Africa) తో తలపడనుంది. టీ20 ప్రపంచ కప్ లో ఆస్టేలియా అత్యంత విజయవంతమైన జట్టు. దక్షిణాఫ్రికా తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. అందువల్ల, రెండు జట్లు ప్రపంచ కప్ ట్రోఫీ కోసం ఢీకొంటాయి.
ప్రపంచ కప్ (World Cup) ట్రోఫీ కోసం జరిగే ఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా (Australia) నేడు సౌతాఫ్రికా(South Africa) తో తలపడనుంది. టీ20 ప్రపంచ కప్ లో ఆస్టేలియా అత్యంత విజయవంతమైన జట్టు. దక్షిణాఫ్రికా తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. అందువల్ల, రెండు జట్లు ప్రపంచ కప్ ట్రోఫీ కోసం ఢీకొంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ గొప్ప మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు.కేప్‌టౌన్‌లోని( Cape Town) న్యూలాండ్స్‌లో ఈ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. మ్యాచ్ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఆస్ట్రేలియా (Australia) అత్యంత విజయవంతమైన జట్టు. అయితే సౌతాఫ్రికా స్వదేశంలో ఆడుతోంది. దక్షిణాఫ్రికా అభిమానులు తమ జట్టు ఫైనల్‌కు చేరుకున్నందుకు ఆనందంగా వారు ర్యాలీ నిర్వహించారు.ఆస్ట్రేలియా ఫైనల్ చేరడం ఇది 7వ సారి. అలాగే ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్‌ను వరుసగా 2 సార్లు కైవసం చేసుకుంది. 2020లో టీమిండియాను, 2018లో ఇంగ్లండ్‌ను ఫైనల్లో ఆస్ట్రేలియా ఓడించింది. అందువల్ల ఈ ఏడాది ప్రపంచకప్ గెలిచి హ్యాట్రిక్ (hat trick) పూర్తిచేసే అవకాశం ఆస్ట్రేలియాకు ఉంది. మరోవైపు పటిష్టంగా ఉన్న సౌతాఫ్రికా జట్లుతో ఆస్ట్రేలియా సవాల్ ఎదురవుతుంది. అందుకే అనుభవం ఉన్న ఆస్ట్రేలియా గెలుస్తుందా.. లేక స్వదేశంలో సౌతాఫ్రికా రాణిస్తుందా అనే దానిపైనే క్రికెట్ (Cricket) ప్రపంచం దృష్టి ఉంటుంది.
దూకుడైన ఆటతో వరుసగా ఏడో సారి టీ20 ప్రపంచకప్ ఫైనల్ (Final) ఆడబోతున్న ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా ఉంది. టీమ్ఇండియాతో సెమీస్‌లో తడబడ్డా చివరకు విజేతగా నిలిచింది. ఆఖరి బంతి వరకూ పట్టు వదలకుండా పోరాడే తత్వమే ఆ జట్టును ప్రపంచ క్రికెట్లో తిరుగులేని స్థానంలో నిలబెట్టింది. ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా మనోస్థైర్యం కోల్పోకుండా గెలుపు కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. తీవ్ర ఒత్తిడి ఉండే ప్రపంచకప్( world cup) నాకౌట్ మ్యాచ్‌ల్లో ఎలా విజయాలు సాధించాలో ఆ జట్టుకు బాగా తెలుసు. దూకుడైన ఆటతీరుతో ఫలితాలు తారుమారు చేస్తోంది. ఇప్పుడు ఈ తుదిపోరులోనూ సఫారీ జట్టును చిత్తుచేయాలనే లక్ష్యంతో ఉంది. కెప్టెన్ మెగ్ లానింగ్ ఆస్ట్రేలియాను సమర్థంగా నడిపిస్తోంది. ఆమెతో పాటు అలీసా హీలీ, బెత్ మూనీ, ఆష్లీ గార్డెనర్ పరుగుల వేటలో సాగుతున్నారు. గార్డెనర్ బంతితోనూ సత్తాచాటుతోంది. బౌలింగ్‌లో ఆమెతో పాటు మెగాన్ షట్, డార్సీ బ్రౌన్ కీలకం కానున్నారు.
పోరాటాన్ని నమ్ముకుని..: ఆస్ట్రేలియాను ఓడించేలా ప్రణాళికలను సమర్థంగా అమలు చేస్తే.. ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా(South Africa) ప్రయాణానికి అద్భుతమైన ముగింపు దక్కుతుంది. ఇంగ్లాండ్ ( England) తో సెమీస్‌లో పోరాట స్ఫూర్తితో విజయం సాధించిన సఫారీ జట్టు.. ఫైనల్లో ఆస్ట్రేలియాపై పైచేయి సాధించాలంటే మరింత గొప్పగా రాణించాలి. గత 12 నెలలుగా అంతర్జాతీయ క్రికెట్లో దక్షిణాఫ్రికా పురోగతి సాధిస్తోంది. నిరుడు వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ (Semis) వరకూ వెళ్లగలిగింది. ఇప్పుడు పొట్టి కప్పులో తుది సమరానికి సై అంటోంది. లారా వోల్వార్ట్, తజ్మిన్ బ్రిట్స్ రూపంలో ఆ జట్టుకు అత్యుత్తమ ఓపెనర్లు ఉన్నారు. ఈ టోర్నీలోనే ఉత్తమ ఓపెనింగ్ జోడీ ఇదే. సెమీస్‌లో చెరో అర్ధశతకం సాధించిన వీళ్లు సూపర్ ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసొచ్చే అంశం. ఆల్‌రౌండర్ మరిజేన్ కాప్ కూడా ఆ జట్టుకు కీలకం. సెమీస్‌లో చెలరేగిన పేసర్లు షబ్నిమ్ ఇస్మాయిల్, అయబొంగా ఖకా జోరుమీదున్నారు. ఇక స్వదేశంలో అభిమానుల మద్దతు ఆ జట్టుకు కొండంత బలం.