»Team India Beat Australia By 5 Wickets In 1st Odi Is Bindra Stadium Mohali Ind Vs Aus 1st Odi Full Match Highlights
IND vs AUS: 27 ఏళ్ల తర్వాత మొహాలీలో విజయం.. ఉత్కంఠభరితం కానున్న రెండో వన్డే
ఆస్ట్రేలియా నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియాకు శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
IND vs AUS: మహ్మద్ షమీ విధ్వంసక బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌ల హాఫ్ సెంచరీలతో తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. భారత్ తరఫున తొలి బౌలింగ్‌లో మహ్మద్ షమీ ఐదు వికెట్లు పడగొట్టాడు. దీని తర్వాత బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ 74 పరుగులతో, రుతురాజ్ గైక్వాడ్ 71 పరుగులతో ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీని తర్వాత సూర్యకుమార్ యాదవ్ 50 పరుగులు, కేఎల్ రాహుల్ 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా టీమ్ ఇండియా మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించింది.
ఆస్ట్రేలియా నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియాకు శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గిల్ తన సొంత మైదానంలో ఆస్ట్రేలియా బౌలర్లను చిత్తు చేశాడు. గిల్ కేవలం 63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. 37 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. గైక్వాడ్ 10 ఫోర్ల సాయంతో 71 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. శుభారంభం తర్వాత టీమ్ ఇండియా మిడిల్ ఆర్డర్ తడబడింది. 142 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా కేవలం 9 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. భారత్ 148 పరుగుల వద్ద రెండో వికెట్, 151 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. గైక్వాడ్, గిల్ తర్వాత శ్రేయాస్ అయ్యర్ మూడు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు.
దీని తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ కొన్ని దూకుడు షాట్లు ఆడినా ఇషాన్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. 26 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇషాన్ వికెట్ వెనుక పాట్ కమిన్స్ క్యాచ్ ఔటయ్యాడు. 185 పరుగుల వద్ద నాలుగో వికెట్ పడిపోయిన తర్వాత, సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో కలిసి ఐదో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సూర్య 49 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 50 పరుగులు చేశాడు. అయితే, భారత్ విజయానికి ముందు, సూర్య సిక్సర్ కొట్టే ప్రయత్నంలో ఔటయ్యాడు. కానీ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఒక ఎండ్‌లో నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. రాహుల్ 63 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో అజేయంగా 58 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అతనితో పాటు జడేజా మూడు పరుగులతో నాటౌట్‌గా వెనుదిరిగాడు. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయామన్న కసితో ఆస్ట్రేలియా జట్టు ఉంది. ఎలాగైనా రెండో మ్యాచ్ గెలిచి తీరాలని ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పులు చేస్తోంది.