weather change:అహ్మదాబాద్లో మారిన వాతావరణం.. అభిమానుల్లో టెన్షన్..?
weather changed at ahmedabad:అహ్మదాబాద్ (Ahmedabad) నరేంద్ర మోడీ (narendra modi) స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకలపై వర్ష ప్రభావం పడనుంది. నిన్ననే సిటీలో చాలా చోట్ల వర్షం కురిసింది. ఈ రోజు వర్షం పడితే ఆరంభ వేడుకలే కాదు.. మ్యాచ్ జరిగే అవకాశం ఉండదు.
weather changed at ahmedabad:కాసేపట్లో అహ్మదాబాద్ (Ahmedabad) నరేంద్ర మోడీ (narendra modi) స్టేడియంలో ఐపీఎల్ 2023 వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఐపీఎల్ సెలబ్రేషన్స్ జరుగుతాయా లేదా అనే సందేహాం నెలకొంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. నిన్న సిటీలో పలు చట్ల వర్షం కూడా కురిసింది.
వర్షం పడటం.. వాతావరణం చల్లగా ఉండటంతో ఐపీఎల్ ఫస్ట్ డే (ipl) వేడుక గురించి అభిమానుల్లో ఒక్కటే ఆందోళన. దీంతోపాటు ఫస్ట్ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. వాతావరణ శాఖ మాత్రం ఈ రోజు వర్ష ప్రభావం ఉండకపోవచ్చు అని చెబుతోంది.
వచ్చే 24 గంటల్లో అహ్మదాబాద్ ఉష్ణోగ్రతల్లో (weather) మాత్రం పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. రెండు మూడు డిగ్రీల సెల్సీయస్ పెరగొచ్చని మాత్రం భారత వాతావరణ శాఖ తెలిపింది. అక్యు వెదర్.కామ్ ఇచ్చే వెబ్సైట్ కూడా మ్యాచ్ డే రోజున వర్షం కురిసే సూచనలు ఏవీ లేవని స్పష్టం చేసింది.
ఓపెనింగ్ సెర్మనీలో సినీ తారలు రష్మిక మందాన (rashmika), తమన్నా భాటియా (tamanna), సింగర్ అర్జిత్ సింగ్ ఆట, పాటలతో అలరిస్తారు. కత్రినా కైఫ్ (katrina kaif), టైగర్ ష్రాఫ్ కూడా పాల్గొంటారని సమాచారం. ఐపీఎల్ మ్యాచ్లు స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.