బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ (Saina Nehwal) కుటుంబ సమేతంగా అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. దక్షిణ కశ్మీర్లోని మంచు శివలింగాన్ని దర్శించి పూజలు చేసినట్లు ఆమె తెలిపారు.యాత్రకు వెళ్లిన ఫొటోలను సైనా నెహ్వాల్ ట్విటర్ హ్యాండిల్ ద్వారా పంచుకున్నారు. బుధవారం 7805 మంది భక్తులను అమర్నాథ్ యాత్ర(Amarnath Yatra)కు అధికారులు అనుమతించారు. అదే సమయంలో ఆమె అమర్నాథ్ పవిత్ర గుహను సందర్శించి బాబా బర్ఫానీ (Baba Barfani) ఆశీస్సులు కూడా తీసుకున్నారు.ప్రతి ఏటా ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది జూలై 1 నుంచి మొదలైయింది.
సుమారు 62 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 31న ముగియనుంది. వర్షాలు కురుస్తున్నా వేలమంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఈ యాత్రలో పాల్గొన్న భక్తులకు ప్రధాని నరేంద్రమోదీ (PMMODI) శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని చోట్ల కొండ చరియలు విరిగిపడటంతో జమ్ములోని ఉదంపూర్ జిల్లా(Udhampur District)లో అమర్నాథ్ యాత్రికులను నిలిపివేశారు. బుధవారం మళ్లీ కొంతమందికి అనుమతినిచ్చారు. యాత్రికుల కోసం అన్ని వసతులతో శిబిరాలను సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు.యాత్ర సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు. పారామిలటరీ దళాలతో పాటు సైనికదళాలను మోహరించారు.