»Huge Solar Storms In 2025 The Possibility Of The End Of The Internet
Solar storms: 2025లో భారీగా సౌర తుఫాన్లు..ఇంటర్నెట్ అంతం అయ్యే అవకాశం!
రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువ కానుంది. సౌర వ్యవస్థ భారీగా వేడెక్కనుంది. సౌర తుఫాన్ల వల్ల ఇంటర్నెట్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ నివేదిక పరిశోధకులకు ఆందోళనను కలిగిస్తోంది.
ఈ మధ్యకాలంలో సౌర తుఫాన్లు(Solar Storms) ఎక్కువ అలజడిని సృష్టిస్తున్నాయి. సూర్యుడి ఎండ తీవ్రతకు భూమి మండిపోతోంది. ఇలానే ఉంటే 2025లో సూర్యుడి భగభగలు మరింత తీవ్రం కానున్నట్లు వాషింగ్టన్ పోస్టు ఓ వార్తను ప్రచురించగా అది కాస్తా వైరల్ అవుతోంది. అప్పటి సూర్యుడి వేడిని డిజిటల్ సమాజం తట్టుకోలేందని ఆ కథనం తెలిపింది. ఆ కథనం చదివాక.. ఇంటర్నెట్ యుగాంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని నెట్టింట యూజర్లు చేస్తున్న ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి.
తాజాగా సోషల్ మీడియా యూజర్లు సూర్యుని తాపంపై ట్రోల్ చేస్తున్నారు. అయితే 2025లో వచ్చే సౌర తుఫాన్ల వల్ల ఇంటర్నెట్కు సమస్య వాటిల్లే అవకాశాల గురించి నాసా ఏ ప్రకటన చేయలేదు. సౌర తుఫాన్లు తీవ్రంగా ఉంటే ఎలా ఉంటుందన్న పరిస్థితిని ఇప్పటి వరకు ఎదుర్కోలేదని నాసా తెలిపింది. ప్రస్తుతం ఉన్న మౌళిక సదుపాయాలు ఏమవుతాయో చెప్పలేమని, ఆ ప్రభావాన్ని అంచనా చేయలేమని కాలిఫోర్నియా వర్సిటీ కంప్యూటర్ ప్రొఫెసర్ సంగీత అబూ జ్యోతి వివరాలు వెల్లడించారు.
సోలార్ సూపర్‌స్టార్మ్స్.. ప్లానింగ్ ఫర్ ఆన్ ఇంటర్నెట్ అపోకలిప్స్ అన్న టైటిల్‌తో జ్యోతి ఓ రిపోర్టు అందించారు. తీవ్ర సౌర తుఫాన్ల వల్ల సముద్రగర్భంలో ఉన్న కమ్యూనికేషన్ కేబుల్స్ కూడా దెబ్బతిననున్నట్లు వెల్లడించారు. కొన్ని నెలల పాటు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపే అవకాశాలు ఉన్నాయని, ప్రతి రోజు కనీసం 11 బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రకటన ప్రస్తుతం పరిశోధకుల్లో అలజడిని సృష్టిస్తోంది.