»Rohit Sharma Said That He Is Still Unable To Digest The Loss Of The World Cup
Rohit Sharma: వరల్డ్ కప్ ఓడటం ఇంకా జీర్ణించుకోలేదు
వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోవడాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకా జీర్ణించుకోలేదని పేర్కొన్నారు. కప్ కోసం ఎంతో కష్టపడి ఆడామని తెలిపారు. చివరి మ్యాచ్‌లో కలిసి రాలేదని, ఓటమిని తట్టుకోవడం అంత సులువు కాదని వెల్లడించారు. ఆ బాధ నుంచి బయటపడడానకే యూకే వెళ్లినట్లు తెలిపారు. అండగా ఉన్న అభిమానలకు ధన్యవాదాలు చెప్పారు.
Rohit Sharma said that he is still unable to digest the loss of the World Cup
Rohit Sharma: వన్డే ప్రపంచ కప్-2023(World Cup-2023) క్షణాలు ఇంకా కళ్ల ముందరే కదలాడుతున్నాయి. చివరి వరకు పోరాడి ఓడిన మన భారత ఆటగాళ్లపై ప్రేమ, అభిమానం పెరిగిందే కానీ తగ్గలేదు. ఆస్ట్రేలియాతో ఆడిన చివరి ఆటలో కొన్ని తప్పులు ఉన్నాయని.. వాటి వలన ఓడిపోలేదని స్టార్ క్రికెటరల్ రోహిత్ శర్మ(Rohit Sharma) పేర్కొన్నారు. మ్యాచ్ ఓడిన తరువాత మైదానంలో మాట్లాడిన రోహిత్ మరెక్కడా కనిపించలేదు. టీమ్ ఓటమిపై వివరణ ఇవ్వలేదు. తాజాగా ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
‘‘నేను ఓటమి నుంచి బయటపడలేదు. ఆట ముగిసిన తర్వాత కొద్ది రోజులు ఏం చేయాలో తెలియలేదు. నా కుటుంబం, స్నేహితులు, అభిమానులు మద్దతుగా నిలిచారు. ఓటమిని జీర్ణించుకోవడం తేలికేం కాదు. జీవితం ముందుకు సాగిపోతుందని తెలుసు. పరిస్థితులు కష్టంగా మారాయి అనిపించింది. 50 ఓవర్ల క్రికెట్‌ను చూస్తూ పెరిగాను, వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకున్నాము. వరల్డ్ కప్ కోసం తీవ్రంగా శ్రమించాం. కప్‌ను సాధిస్తే బాగుండేది. లీగ్ మ్యాచ్‌లతో సహా వరుసగా పది మ్యాచ్‌లు గెలిచాము. ఇక ఫైనల్లో ఏమైనా పొరపాట్లు చేశారా? అంటే అవును మేం కొన్ని తప్పులు చేశాం. అవి కొత్తవేమి కాదు, ప్రతి మ్యాచ్‌లోనూ జరిగాయి. కానీ విజయం సాధించాము. ఫైనల్లో మాకు కలిసిరాలేదు. అని రోహిత్ శర్మ పేర్కొన్నారు. ఇంకా మాట్లాడుతూ..
గ్రౌండ్లో టీమ్ అంతా మంచి ప్రదర్శన చేశాము. ప్రతి మ్యాచ్‌లోనూ అభిమానులను సంతోషపరిచాము. చివర్లో మిస్ ఫైర్ అయింది. ఆ ఓటమి బాధ నుంచి బయటపడేందుకు ఎక్కడికైనా వెళ్లాలని నిర్ణయించుకుని కుటుంబంతో సహా యూకేకు వచ్చా. అభిమానులందరూ మేము పెట్టిన శ్రమను, ఆటతీరును అభినందిస్తుంటే కాస్త రిలీఫ్‌గా ఉంది. పదకొండు మ్యాచ్‌లను చూస్తూ అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తప్పకుండా త్వరలోనే రెట్టించిన ఉత్సాహంతో మరో అద్భుతమైన బహుమతి కోసం సిద్ధం అవుతాను అని రోహిత్ శర్మ పేర్కొన్నారు.