విశాఖలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి 20 మ్యాచ్‌లో భారత్ ఉత్కంఠభరిత విజయం సాధించింది. చివరి బాల్‌ను రింకూ సింగ్ సిక్సర్‌గా మలచడంతో విక్టరీ కొట్టింది. ఆ సిక్సర్‌ను అంపైర్లు పరిగణలోకి తీసుకోలేదు.
Rinku Singh: వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌లో విక్టరీ కొట్టింది. సీనియర్లు లేకున్నా.. జూనియర్లు జట్టును ముందుండి నడిపించారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. 209 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ధాటిగానే ఆడింది. చివరి ఓవర్ ఉత్కంఠగా మారింది. రింకూ సింగ్ సిక్సర్ కొట్టడంతో భారత్ విజయం ఖాయమైంది.
రింకూ సింగ్ (Rinku Singh) కొట్టిన సిక్సర్ నో బాల్ అయ్యింది. విజయానికి కావాల్సిన ఒక పరుగు ఎక్స్ ట్రా రూపంలో వచ్చింది. ఇంకేముంది రింకూ సింగ్ (Rinku Singh) సిక్సర్ లెక్కలోకి తీసుకోలేదు. నో బాల్ వల్ల రింకూ సింగ్ కొట్టిన భారీ షాట్ అకౌంట్లోకి రాలేదు. కానీ అభిమానులు ఈలలు, కేకలతో విశాఖ స్టేడియం హోరెత్తింది. వరల్డ్ కప్ ఫైనల్ తర్వాతి మ్యాచ్ కావడం, గెలవడంతో కాస్త సంతోషించారు. మెజార్టీ అభిమానులు మాత్రం ఆ మ్యాచ్ చూడలేదు. వరల్డ్ కపే గెలవలేదు.. ఇక టీ 20 మ్యాచ్ ఎందుకని ఊరికే ఉన్నారు.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వేదికపై కూడా దుమారం కొనసాగుతోంది. అహ్మదాబాద్ కాకుండా.. కోల్ కతా లేదంటే.. ముంబైలో నిర్వహిస్తే బాగుండేదని.. భారత్ తప్పక గెలిచేందని అంటున్నారు. ప్రముఖుల అభిప్రాయంతో క్రీడాభిమానులు కూడా ఏకీభవిస్తున్నారు.