»Rashid Khan Donated His Complete Match Fees Of Icc Cricket World Cup 2023 To Help Victim Of Afghanistan Earthquake
World Cup 2023: ఆఫ్ఘనిస్తాన్ భూకంప బాధితులకు.. ప్రపంచ కప్ మ్యాచ్ ఫీజంతా విరాళంగా ప్రకటించిన క్రికెటర్
ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్ ప్రపంచంలోనే గొప్ప బౌలర్. అతను ఆటలో ఎంత గొప్ప ఆటగాడో.. బయట కూడా తన మంచితనాన్ని నిరూపించుకున్నాడు. మరోసారి తన మన స్వభావంతో అందరి మనసులను గెలుచుకున్నాడు.
World Cup 2023: ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్ ప్రపంచంలోనే గొప్ప బౌలర్. అతను ఆటలో ఎంత గొప్ప ఆటగాడో.. బయట కూడా తన మంచితనాన్ని నిరూపించుకున్నాడు. మరోసారి తన మన స్వభావంతో అందరి మనసులను గెలుచుకున్నాడు. ప్రపంచకప్‌లో అందుకున్న తన మొత్తం మ్యాచ్ ఫీజును విరాళంగా ఇస్తున్నట్లు రషీద్ ఖాన్ ప్రకటించాడు. ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం వల్ల నష్టపోయిన బాధితుల సహాయార్థం తన డబ్బును విరాళంగా ఇచ్చాడు. ఈ విషయాన్ని రషీద్ ఖాన్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశాడు. అతను ఒక పోస్ట్‌లో ఇలా వ్రాశాడు, “ఆఫ్ఘనిస్తాన్లోని పశ్చిమ ప్రావిన్స్‌లలో (హెరాత్, ఫరా, బాద్గీస్) సంభవించిన భూకంపం విషాద పరిణామాల గురించి విన్నందుకు నేను చాలా బాధపడ్డాను. భూకంపం కారణంగా నష్టపోయిన వారికి సహాయం చేయడానికి నేను నా ప్రయత్నాలన్నింటినీ చేస్తున్నాను. అంటూ రాసుకొచ్చాడు.
I learned with great sadness about the tragic consequences of the earthquake that struck the western provinces (Herat, Farah, and Badghis) of Afghanistan. I am donating all of my #CWC23 match fees to help the affected people. Soon, we will be launching a fundraising campaign to… pic.twitter.com/dHAO1IGQlq
వాస్తవానికి, శనివారం ఆఫ్ఘనిస్తాన్‌లో భయంకరమైన భూకంపం సంభవించింది. ఇది అక్కడ వినాశనాన్ని సృష్టించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం ప్రకారం.. ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు 2000 మందికి పైగా మరణించారు. 9000 మందికి పైగా గాయపడ్డారు. 1300 కంటే ఎక్కువ ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో ఈ భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య, గాయపడిన వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది. మరోవైపు, ఆఫ్ఘనిస్తాన్ సూపర్ స్టార్ రషీద్ ఖాన్ ప్రస్తుతం భారతదేశంలో ICC ODI క్రికెట్ ప్రపంచ కప్ ఆడుతున్నాడు. తన దేశానికి జరిగిన అన్యాయానికి ప్రతిఫలంగా తన వంతు సాయంగా తనకు ప్రపంచ కప్ మ్యాప్ ఫీజు మొత్తం విరాళం ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు.