టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (tennis star sania mirza) సొంతగడ్డపై చివరి మ్యాచ్ ఆడి, రెండు దశాబ్దాల క్రితం తొలి డబ్ల్యూటీఏ టైటిల్ నెగ్గిన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోనే (Hyderabad LB stadium)… క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖుల సమక్షంలో తన సుదీర్ఘ కెరీర్‌కు ఆదివారం భావోద్వేగ వీడ్కోలు పలికింది. ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన రెండు మిక్స్డ్ డబుల్స్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల్లోనూ సానియా జోడీ విజేతగా నిలిచింది. తన సుదీర్ఘ కెరియర్ తో ఎన్నో ఘనతలు సాధించిన, దేశంలో టెన్నిస్ కు ఎంతో ప్రచారం తీసుకొచ్చిన సానియాకు అన్ని వైపుల నుంచి వీడ్కోలు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తాజాగా ఆమె రిటైర్మెంట్ పైన టాలీవుడ్ నటుడు (Tollywood Actor) రామ్ చరణ్ తేజ (Ram Charan) ట్వీట్ చేశారు. ‘మై డియర్ బడ్డీ సానియా మీర్జా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెన్నిస్ కోర్టులు మీ ఆటను మిస్ అవుతాయి. భారతదేశంలో క్రీడలకు మీరు అందించిన సహకారం ఎనలేనిది. మీరు మమ్మల్ని గర్వపడేలా చేస్తూనే ఉన్నారు’ అని ఉపాసనతో కలిసి సానియాతో దిగిన ఫొటోను చరణ్ ట్వీట్ చేశారు.
టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా సొంతగడ్డపై చివరి మ్యాచ్ ఆడింది. ఇరవై ఏళ్ల క్రితం తొలి డబ్ల్యూటీఏ టైటిల్ నెగ్గిన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో.. ప్రముఖుల సమక్షంలో సానియా తన సుదీర్ఘ కెరీర్‌కు ఆదివారం వీడ్కోలు పలికింది. మరెందరో సానియాలను తయారు చేయడమే తన లక్ష్యమంటూ అభిమానులకు స్పష్టం చేసింది. వీడ్కోలు వేదికపై సానియాను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ సన్మానించారు. తొలి డబ్ల్యూటీఏ టైటిల్ (2004లో) నెగ్గిన ఎల్బీ స్టేడియంలో అల్విదా చెప్పింది. ఇప్పటికే ప్రొఫెషనల్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత టెన్నిస్ స్టార్.. ఆదివారం ఎల్బీ టెన్నిస్ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడింది. కేంద్ర, రాష్ట్ర మంత్రుల నుంచి పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. స్టేడియం అంతా సానియా నామస్మరణతో మార్మోగింది. సానియా ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, 43 డబ్ల్యూటీఏ ట్రోఫీలు గెలుచుకున్నది. భారత టెన్నిస్‌లో ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగింది. గత నెలలో దుబాయ్ ఓపెన్‌తోనే ప్రొఫెషనల్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సానియా టెన్నిస్ ఓనమాలు నేర్చిన ఎల్బీ స్టేడియంలో ఆడాలనే ఉద్దేశంతో ఆదివారం ప్రత్యేక ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో పాల్గొన్నది.