»Pilots Request To Dhoni After He Threatens To Leave Csk Captaincy
MS Dhoni: ధోనీ మరింత కాలం కెప్టెన్ గా ఉండాలంటూ…
ఇటీవల చెన్నై టీమ్ విమానంలో ప్రయాణిస్తుండగా పైలట్ చేసిన విజ్ఞప్తి అందరినీ ఆకట్టుకున్నది. ధోనీ మరింత కాలం కెప్టెన్ గా కొనసాగాలంటూ లౌడ్ స్పీకర్లలో విజ్ఞప్తి చేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్ (chennai super kings) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి (CSK captain MS Dhoni) ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ధోనీ (MS Dhoni) కేవలం ఐపీఎల్ లో (indian premier league – IPL) లో మాత్రమే ఆడుతున్నాడు. ప్రతి జట్టు కూడా మరో జట్టుతో రెండు సార్లు ఆడుతుంది. ఒకసారి సొంత గడ్డ పైన, రెండోది ప్రత్యర్థి గడ్డ పైన. ఉదాహరణకు చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడితే ఓ మ్యాచ్ చెన్నైలో, మరో మ్యాచ్ బెంగళూరులో జరుగుతుంది. ఇలా ధోనీ టీమ్ ఇటీవల వేరే చోటకు ప్రయాణిస్తోంది. ఈ సమయంలో విమానంలో పైలట్ చేసిన విజ్ఞప్తి నెట్టింట వైరల్ గా మారింది.
విమానం నడిపై పైలట్ ధోనీకి పెద్ద అభిమాని. తాను నడిపే విమానంలో చెన్నై జట్టు ఉండటంపై ఆయన తబ్బిబ్బయ్యాడు. తన ఆనందాన్ని లౌడ్ స్పీకర్స్ లో వ్యక్తం చేశాడు. తాను ధోనీకి పెద్ద అభిమానిని అని, అతను చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా మరింత కాలం కొనసాగాలని విజ్ఞప్తి చేశాడు. ఈ విజ్ఞప్తితో అందులో ప్రయాణిస్తున్న ఇతర అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ధోనీ వచ్చే ఏడాది నాటికి ఐపీఎల్ కు కూడా వీడ్కోలు చెబుతారని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ అభిమాన పైలట్ ఇలా విజ్ఞప్తి చేయడం గమనార్హం.
ఐపీఎల్ 16లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్ లు ఆడింది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడింది. లక్నో, ముంబై జట్లను ఓడించింది. పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ధోనీ ఫినిషింగ్ లో తన దూకుడును అలాగే కొనసాగించడం అభిమానులను అలరిస్తోంది. రాజస్థాన్, కోల్ కతా, లక్నో, గుజరాత్, చెన్నై, పంజాబ్ జట్లు మూడు మ్యాచ్ ల చొప్పున ఆడి, రెండు చొప్పున గెలిచాయి. ఈ జట్లన్నీ 4 పాయింట్లతోనే ఉన్నప్పటికీ, నెట్ రన్ రేట్ పరంగా రాజస్థాన్ ముందు నిలిచింది. హైదరాబాద్ జట్టు మూడింట రెండు మ్యాచ్ లు ఓడి 8వ స్థానంలో ఉంది. ఢిల్లీ మూడుకు మూడు ఓడిపోయింది.