Mohammad Rizwan: వన్డే ప్రపంచకప్లో రాణిస్తున్న పాకిస్థాన్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ వివాదంలో చిక్కుకున్నాడు. హైదరాబాద్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో రిజ్వాన్ పాక్కు విజయాన్ని అందించాడు. అక్టోబర్ 6వ తేదీన హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో పాకిస్థాన్-నెదర్లాండ్స్ మ్యాచ్ సందర్భంగా రిజ్వాన్ మైదానంలో నమాజ్ చేస్తూ కెమెరాల్లో కనిపించాడు. మైదానంలోనే రిజ్వాన్ నమాజ్ చేయడంపై న్యాయవాది వినీత్ జిందాల్ ఐసీసీకి ఫిర్యాదు చేశాడు. రిజ్వాన్ మైదానంలో నమాజ్ చేయడం ఆట స్ఫూర్తికి విరుద్ధమని వినీత్ జిందాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. భారత ప్రేక్షకుల ముందు నమాజ్ చేసి తాను ముస్లిం అని చూపించడం క్రీడా స్ఫూర్తిని ప్రభావితం చేస్తుందని జిందాల్ ఆరోపించారు.
Supreme court lawyer, Vineet Jindal has filed a complaint to the International Cricket Council (ICC) against Pakistan's wicket-keeper batsman Mohammad Rizwan for offering namaz on the ground and voicing support for Gaza which according to the complainant "Defeated the spirit of… pic.twitter.com/QuApDT93N4
మైదానంలో ప్రార్థనలు చేయడం, శ్రీలంకపై తన ప్రదర్శనను గాజాకు అంకితం చేయడాన్ని తన ఫిర్యాదులో తెలిపాడు. శ్రీలంకపై గెలుపును రిజ్వాన్ గాజాకి అంకితం చేసి.. మద్ధతుగా నిలిచాడు. ఐసీసీకి ఎలాంటి చర్య తీసుకోలేదు. మైదానం బయట ఆటగాడు చేసేది మా పరిధిలో లేదు. దీనికి మేం ఎలాంటి చర్య తీసుకోలేం. ఇది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పరిధిలోకి వస్తుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీసుకుంటే రిజ్వాన్పై చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. 2021 టీ20 ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డ సమయంలో రిజ్వాన్ మైదానంలో నమాజ్ చేశాడు. అప్పుడు వినీత్ జిందాల్ చేసిన ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఐసీసీ స్పందించలేదు.