»Nz Vs Afg Defeated Afghan Team New Zealands Great Victory
NZ vs AFG: చిత్తు చిత్తుగా ఓడిన ఆప్ఘన్ జట్టు.. న్యూజిలాండ్ ఘన విజయం
నేడు జరిగిన వరల్డ్ కప్ టోర్నీ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 289 పరుగుల టార్గెట్‌ను ఆఫ్ఘన్ చేరుకోలేకపోయింది. 139 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో న్యూజిలాండ్ వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2023 (ICC ODI World Cup-2023) టోర్నీలో న్యూజిలాండ్ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. నేడు చెన్నైలో ఆఫ్ఘన్‌తో జరిగిన మ్యాచ్‌లో 149 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 289 పరుగుల లక్ష్యఛేదనతో బ్యాటింగ్ మొదలెట్టిన ఆఫ్ఘన్ 34.4 ఓవర్లలోనే 139 పరుగులకు ఆలౌట్ అవ్వడం విశేషం. ఆఫ్ఘన్ చిత్తు చిత్తుగా ఓడటంతో న్యూజిలాండ్ అద్భుత విజయాన్ని సాధించింది.
భారీ టార్గెట్‌తో రంగంలోకి దిగిన ఆఫ్ఘన్ జట్టు ఏమేరకూ ఆడలేకపోయింది. టాప్ ఆర్డర్ బాగా విఫలం అయ్యింది. రెహ్మనుల్లా గుర్భాజ్ 11, ఇబ్రహీం జాద్రన్ 14, హస్మతుల్లా షాహిదీ 8 పరుగులు చేసి అవుట్ కావడంతో 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఆఫ్ఘన్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత రెహ్మత్ షా 36, అజ్మతుల్లా ఓమర్జాయ్ 27, మహ్మద్ నబీ 7, రషీద్ ఖాన్ 8, ముజీబ్ 4 పరుగులు మాత్రమే చేయగలిగారు. నవీన్ ఉల్ హక్, ఫజల్ హక్ ఫరూకీ డకౌట్ కావడంతో ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ అక్కడితో ఆగిపోయింది. చిత్తుగా ఔట్ అవ్వడం వల్ల ఆఫ్ఘన్ 139 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అంతకుముందు మొదట టాస్ ఓడిన న్యూజిలాండ్ బ్యాటింగ్ చేపట్టింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేయగలిగింది. 71 పరుగులు చేసిన గ్లెన్ ఫిలిప్స్ జట్టును ఆదుకున్నాడు. మరో బ్యాటర్ టామ్ లాథమ్ 68 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ జట్టు 139 పరుగులకే 34.4 ఓవర్లలో చిత్తుగా ఆలౌట్ అవ్వటంతో న్యూజిలాండ్ విజయాన్ని సొంతం చేసుకుంది.