రేపు జరగబోయే ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో టీమిండియాను ఓడిస్తే తాను బంగ్లాదేశ్ క్రికెటర్‌తో డేట్ చేస్తానని ఓ పాకిస్తాన్ నటి ఆఫర్ ఇచ్చింది. భారత్‌ను ఎలాగైనా ఓడించాలన్నదే తన ఆకాంక్ష అని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ (ICC Odi World Cup-2023) వాడివేడిగా సాగుతోంది. ఈ టోర్నీలో అన్ని జట్లూ పోటాపోటీగా తలపడుతున్నాయి. ముఖ్యంగా భారత్, పాక్ (IND vs PAK) మధ్య మొన్న రసవత్తర పోరు జరిగిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ (Pakistan) జట్టును టీమిండియా (TeamIndia) చిత్తుగా ఓడించింది. ఆ ఓటమిని కొందరు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా రేపు టీమిండియా, బంగ్లాదేశ్ (Bangladesh) మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ తరుణంలో పాక్ నటి బంగ్లాదేశ్ క్రికెటర్లకు ఓ బోల్డ్ ఆఫర్ ఇచ్చింది.
పాకిస్తాన్ నటి చేసిన ట్వీట్:
InshAllah my Bangali Bandu will avenge us in the next match. I will go to dhaka and have a fish dinner date with Bangali boy if their team managed to beat India ✌️❤️ 🇧🇩
పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారీ (Sehar Shinwari) చేసిన బోల్డ్ ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది. టీమిండియాపై బంగ్లాదేశ్ (Bangladesh) ప్రతీకారం తీర్చుకోవాలని ఆమె కోరింది. అలా ఇండియాను ఓడిస్తే తాను ఢాకా నగరానికి వచ్చి బంగ్లాదేశ్ టీమ్ లోని ఓ క్రికెటర్‌తో డేటింగ్ చేస్తానని ఆఫర్ ఇచ్చింది. ఇండియా ఎలాగైనా ఓడిపోవాలని ఆమె ఆకాంక్షిస్తున్నట్లు తెలిపింది.
ఈ ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఇండియాతో పాకిస్తాన్ మరోసారి తలపడాలంటే పాక్ సెమీస్ వరకూ చేరుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే పాక్ నటి ప్రకటించిన ఆ బోల్డ్ ఆఫర్‌పై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంగ్లా క్రికెటర్‌తో ఆమె ఫిష్ డిన్నర్ చేసి డేటింగ్ చేయనున్నట్లు చెప్పడంతో నెట్టింట పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.