Nitish Rana and Rinku Singh Well Played, kkr won the match
Nitish, Rinku:కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణా (Nitish Rana), రింకూ సింగ్ (Rinku Singh) అర్థ సెంచరీలతో రాణించడంతో కేకేఆర్ సూపర్ విక్టరీ కొట్టింది. సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. 145 పరుగులు మాత్రమే చేసింది. చెన్నై బ్యాట్స్‌మెన్‌ను కోల్ కతా బౌలర్లు కట్టడి చేశారు.
ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ (kkr).. ఆదిలోనే 3 వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోర్ 33 పరుగుల వద్ద వికెట్లు పోయి కష్టాల్లో పడినట్టు అనిపించింది. అయితే నితీశ్ రాణాకు రింకూ సింగ్ తోడయ్యారు. ఇద్దరు ఒకరు తప్పించి.. మరొకరు హిట్టింగ్ చేశారు. 100 పరుగులు భాగస్వామ్యం నమోదు చేశారు. జట్టును విజయతీరాలకు చేర్చారు.
చివరలో రింకు సింగ్ రనౌట్ కాగా.. జట్టుకు కెప్టెన్ రాణా (Nitish Rana) విజయాన్ని అందించాడు. ఇప్పటివరకు కేకేఆర్ 13 మ్యాచ్‌లు ఆడగా.. 6 మ్యాచ్‌లు గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ 13 మ్యాచ్‌లు ఆడగా.. 5 మ్యాచ్‌లు ఓడిపోయింది. 12 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. చెన్నై, ముంబై.. రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.