»Madras High Court Sentenced Ips Officer Sampath Kumar For 15 Days In Dhoni Defamation Case
MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీపై ఫిక్సింగ్ ఆరోపణలు
2013 ఐపీఎల్ సీజన్లో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫిక్సింగ్, బెట్టింగ్‌లకు పాల్పడ్డాడని ఐపీఎల్ అధికారి ఒకరు ఆరోపించారు. అయితే, ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీపై రెండేళ్ల పాటు నిషేధం విధించింది.
MS Dhoni: 2013 ఐపీఎల్ సీజన్లో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫిక్సింగ్, బెట్టింగ్‌లకు పాల్పడ్డాడని ఐపీఎల్ అధికారి ఒకరు ఆరోపించారు. అయితే, ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీపై రెండేళ్ల పాటు నిషేధం విధించింది. అప్పట్లో ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ నేతృత్వంలో విచారణ జరిగింది. అయితే సంపత్ కుమార్ కొందరు బుకీల నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ అధికారిని ఉన్నతాధికారులు కేసు దర్యాప్తు బాధ్యత నుంచి తప్పించారు. దీంతో బుకీల నుంచి సంపత్ కుమార్ లంచం తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని ట్రయల్ కోర్టు తీర్పునిచ్చి, నిర్దోషిగా విడుదలైంది. అయితే తనపై ఐపీఎస్ అధికారి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మహేంద్ర సింగ్ ధోనీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఓ టీవీ ఛానెల్లో సంపత్ కుమార్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ధోనీ కోర్టుకు తెలిపాడు. టీవీ ఛానల్‌పై, ఐపీఎస్ అధికారిపై ధోనీ రూ.100 కోట్ల పరువునష్టం కేసు కూడా పెట్టాడు. అంతే కాకుండా తాను అడిగిన 17 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని తన పిటిషన్లో పేర్కొన్నారు.
మహేంద్ర సింగ్ ధోనీ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు, టీవీ ఛానెల్, సంపత్ కుమార్‌లకు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే సదరు టీవీ ఛానెల్ ఇచ్చిన క్లారిటీపై మద్రాస్ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ధోనీ లాంటి ప్రముఖ క్రికెటర్‌కి సంబంధించిన వార్తలను చూపించే ముందు టీవీ ఛానెల్ ధృవీకరించాలని కోర్టు ఆదేశించింది. దీనికి తోడు ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ క్లారిటీ కూడా ధోనీ కోపాన్ని తగ్గించలేకపోయింది. పైగా ఆయన ఇచ్చిన వివరణ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నాడంటూ ధోనీ మద్రాస్ హైకోర్టుకు తెలిపారు. ఈరోజు ధోనీ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్‌కు 15 రోజుల జైలు శిక్ష విధించింది. అయితే, అతను అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును 30 రోజుల పాటు నిలిపివేసింది.