»Kohli Is The Pakistan Captain Who Broke The Record Babar Azam Who Created History
Babar Azam: కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన పాక్ కెప్టెన్..చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డును పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ బ్రేక్ చేశాడు. ఆసియా కప్ టోర్నీలోని మొదటి మ్యాచ్‌లో పాక్ జట్టు విజయం సాధించింది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 151 పరుగులు చేసి పలు రికార్డులను తిరగరాశాడు.
ఆసియా కప్ 2023 (Asia Cup 2023)లో భాగంగా తొలి మ్యాచ్ పాకిస్తాన్ (Pakistan), నేపాల్ (Nepal) జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో నేపాల్ జట్టు చిత్తుగా ఓడింది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (Babar AZam) సెంచరీతో చెలరేగాడు. 131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సులతో 151 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు. వన్డే కెరీర్లో బాబర్‌కు ఇది 19వ సెంచరీ కావడం విశేషం. అంతేకాదు మరో రికార్డును కూడా బాబర్ ఆజమ్ సాధించాడు.
ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన కెప్టెన్‌గా బాబర్ ఆజమ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పటివరకు ఆ రికార్డు భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) పేరుపై ఉండేది. కోహ్లీ సాధించిన అత్యధిక స్కోరు (Highest Score) 136 పరుగులు. నేపాల్ (Nepal) మ్యాచ్‌లో బాబర్ 151 పరుగులు చేసి ఆ రికార్డును తిరగరాశాడు. కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టి సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా 19 సెంచరీలు చేసిన ఆటగాడిగా బాబర్ ఆజమ్ (Babar AZam) మరో రికార్డు సాధించడం విశేషం. బాబర్ ఆజమ్ ఈ ఫీట్‌ను 102 ఇన్నింగ్స్‌లలో సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హషీమ్ ఆమ్లా (Haseem Amla) పేరుపై ఉంది. ఆమ్లా 104 ఇన్నింగ్స్ ఆడాడు. 19 సెంచరీలు చేశాడు. తాజాగా ఆ రికార్డును బాబర్ బ్రేక్ చేశాడు.
ఇకపోతే పరుగుల విషయంలో బాబర్ ఆజమ్ మరో రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ (Gautham Gambhir) 5,238 పరుగులతో ఉన్నాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్ (Danion Martin) 5,346 పరుగులు చేశాడు. వారి రికార్డును బ్రేక్ చేస్తూ బాబర్ ఆజమ్ (Babar AZam) 102 ఇన్నింగ్స్ లల్లో 5,353 పరుగులు చేశాడు.