ఐపీఎల్(IPL 2023) మ్యాచ్లో నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru), రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్లు తలపడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్లో భాగంగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ(RCB) బ్యాటింగ్ చేపట్టింది. బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ మొదట్లోనే ఆర్సీబీకి గట్టి దెబ్బే తగిలింది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) తొలి బంతికే ఔటయ్యాడు. రాజస్థాన్(Rajasthan Royals) బౌలర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో కోహ్లీ ఔట్ అవ్వడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఆ తర్వాత షాబాజ్ అహ్మద్ కూడా ఔట్ అయ్యాడు. ఆర్సీబీ(RCB) రెండు వికెట్లు కోల్పోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహం నెలకొంది.
ఆర్సీబీ(RCB) మరో ఓపెనర్ అయిన ఫాఫ్ డుప్లెసిస్ మరో ఆటగాడు మ్యాక్స్ వెల్ తో కలిసి వీరవిహారం చేశారు. ఇద్దరూ క్రీజులో ఉండి స్కోరు బోర్డును కదిలించారు. ఇద్దరూ బౌండరీలు, సిక్సులు బాదారు. డుప్లెసిస్ 62 పరుగులు, మ్యాక్స్ వెల్ 77 పరుగులు చేసి ఔట్ అయ్యారు. వీరిద్దరూ ఔట్ తర్వాత ఆర్సీబీ(Royal Challengers Bengaluru) ఇన్నింగ్స్ తగ్గింది. వరుసగా వికెట్లు పడ్డాయి. 20 ఓవర్లలో ఆర్సీబీ 189 పరుగులు మాత్రమే చయగలిగింది. రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) బౌలర్లలో బౌల్ట్ 2, సందీప్ శర్మ 2, అశ్విన్ 1, చహాల్ 1 వికెట్ ను పడగొట్టారు. రాజస్థాన్ రాయల్స్ ముందు 190 పరుగులు లక్ష్యంగా ఉంది.