ఆస్ట్రేలియాపై భారత్ రెండో వన్డేలో ఘన విజయం సాధించింది. వర్షం అడ్డుపడినప్పటికీ ఆసీస్ 10 వికెట్లను పడగొట్టి సత్తా చాటింది. అటు భారత బ్యాటర్లు కూడా సెంచరీలతో చెలరేగిపోయారు.
ఇండోర్‌లో జరుగుతోన్న రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు సిక్సులు, ఫోర్లతో చెలరేగిపోయారు. మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ ముందు 400 పరుగుల భారీ టార్గెట్ నిలిచింది.
అయితే ఆసిస్ ఇన్నింగ్స్‌కు వర్షం అంతరాయం కలిగించింది. డక్ వర్త లూయిస్ పద్ధతి ప్రకారంగా మ్యాచ్‌ను 33 ఓవర్లకు కుదించిన తర్వాత ఆస్ట్రేలియా టార్గెట్ 317గా నిర్ణయించారు. కాసేపటికి వర్షం ఆగిపోవడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. భారత బౌలర్ల ధాటికి ఆసీస్ ఆటగాళ్లు నిలవలేకపోయారు. 28.2 ఓవర్లకే 217 పరుగులు చేసి ఆసీస్ ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో అశ్విన్ 3, జడేజా 3 వికెట్లు పడగొట్టారు. ప్రసిద్ కృష్ణ 2, షమీ1, ఇషాన్ కిషన్ ఓ రన్ ఔట్ చేశాడు. దీంతో ఇండోర్ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది.