మహిళల టీ20 ప్రపంచ కప్(T20 world cup) సెమీ ఫైనల్లో భారత్ పోరాడి ఓడింది. మ్యాచ్ లో భాగంగా ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేపట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కేప్ టౌన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ నమోదు చేసింది. ఆసీస్ ఓపెనర్ బెత్ మూనీ 54, కెప్టెన్ మెగ్ లానింగ్ 49, ఆష్లే గార్డనర్ 31, అలీసా హీలా 25 రన్స్ చేసి ఆసీస్ స్కోర్ ను ముందుకు నడిపించారు.
ఆస్ట్రేలియా బ్యాటర్ల వద్ద భారత బౌలర్లు విఫలమయ్యారు. టీమిండియా(Team India) బౌలర్లు అయిన శిఖా పాండే 2 వికెట్లు పడగొట్టింది. ఇకపోతే దీప్తి శర్మ, రాధా యాదవ్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇకపోతే 173 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా(Team India) ఆరంభంలోనే కష్టాలపాలైంది.
టీమిండియా(Team India) 28 పరుగులకే 3 వికెట్లు నష్టపోయింది. ఓపెనర్లు నిరాశ పరిచారు. స్మృతి మంధాన 2, షెఫాలీ వర్మ 9 పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. వన్ డౌన్ లో వచ్చిన యస్తికా భాటియా 4 రన్స్ చేసి రనౌట్ తో వెనుదిరిగింది. ఇకపోతే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 52, జెమీమా రోడ్రిగ్స్ 43 పరుగులతో స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. చివరి 18 బాల్స్ మధ్యే మ్యాచ్ టర్న్ తిరిగింది. ఆ మూడు ఓవర్లలో వరుస వికెట్లను భారత్(Team India) కోల్పోయింది. చివరికి 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేయగలిగింది.