»Rohit Sharma Needs To Get Fit Kapil Devs Observation On Bit Overweight India Captain
Kapil Dev: రోహిత్ ఫిట్ నెస్ పైన దృష్టి సారించాలి
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా పైన రోహిత్ శర్మ (Rohit Sharma)నాయకత్వంలోని టీమిండియా (team india) వరుసగా రెండు టెస్టులు గెలిచింది. నాలుగు టెస్టుల సిరీస్లో భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది. తొలి టెస్టులో రోహిత్ శర్మ సెంచరీతో ఆకట్టుకున్నారు. రోహిత్ అదరగొడుతున్నప్పటికీ దిగ్గజ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ (Kapil Dev) ఓ సూచన చేశారు. రోహిత్ తన ఫిట్ నెస్ (Get Fit) పైన దృష్టి సారించాలని హితవు పలికారు.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా పైన రోహిత్ శర్మ (Rohit Sharma)నాయకత్వంలోని టీమిండియా (team india) వరుసగా రెండు టెస్టులు గెలిచింది. నాలుగు టెస్టుల సిరీస్లో భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది. తొలి టెస్టులో రోహిత్ శర్మ సెంచరీతో ఆకట్టుకున్నారు. రోహిత్ అదరగొడుతున్నప్పటికీ దిగ్గజ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ (Kapil Dev) ఓ సూచన చేశారు. రోహిత్ తన ఫిట్ నెస్ (Get Fit) పైన దృష్టి సారించాలని హితవు పలికారు. ఫిట్ గా ఉండటం చాలా ముఖ్యమని, అది కూడా ఓ కెప్టెన్ గా మరింత దృష్టి సారించాలని తెలిపారు.
కెప్టెన్ ఫిట్ గా లేడంటే చాలా అవమానకరంగా ఉంటుందన్నారు. రోహిత్ ఫిట్ నెస్ పైన కసరత్తు చేయాలన్నారు. అతను మంచి బ్యాట్సుమెన్ అని, కానీ ఫిట్ నెస్ గురించి చెప్పాలనుకుంటే అధిక బరువుతో కనిపిస్తున్నట్లుగా ఉందని చెప్పారు. టీవీలో చూస్తుంటే లావుగా కనిపించాడన్నారు. తాను చూసిన ఆటగాళ్లలో రోహిత్ అద్భుతమని, కెప్టెన్ గా, ఆటగాడిగా అదరగొడుతున్నాడన్నారు. కానీ ఫిట్ గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.