CSK:లక్నో సూపర్ జెయింట్స్ (LSG) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు వచ్చిన సీఎస్కే (CSK) ధాటిగా ఆడుతుంది. 8 ఓవర్లలోనే స్కోరు 100 పరుగులు చేసింది. మరో 12 ఓవర్లలో ఇలానే బాదితే 250 స్కోరు చేసే అవకాశం ఉంది. రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj gaikwad) హాఫ్ సెంచరీ చేశాడు. గైక్వాడ్ 55 రన్న్.. కాన్వే (conway) 40 పరుగులతో క్రీజులో ఉన్నారు.
చెపాక్ స్టేడియంలో మహేంద్ర సింగ్ ధోనికి (dhoni) మంచి రికార్డ్ ఉంది. ఇప్పటివరకు 56 మ్యాచ్లు ఆడగా.. 40 మ్యాచుల్లో ఆ జట్టు విజయం సాధించింది. 2011లో ఇదే స్టేడియంలో సీఎస్కే టైటిల్ గెలిచి సంగతి తెలిసిందే. టెస్ట్ సిరీస్లో ఇదే గ్రౌండ్లో మహేంద్ర సింగ్ ధోని (dhoni) డబుల్ సెంచరీ (double century) బాదాడు.