భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. వెన్ను నొప్పితో ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ సిరీస్‌కి దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో మార్నస్ లబుషేన్‌ని జట్టులోకి తీసుకున్నారు. ఇక ఈ సిరీస్‌లో భాగంగా 19న తొలి వన్డే(పెర్త్), 23న రెండోది(అడిలైడ్), 25న మూడో మ్యాచ్(సిడ్నీ) జరగనుంది.