Odi World Cup-2023: కేవలం 2 బంతుల్లోనే 21 పరుగులు చేసిన ఆస్ట్రేలియా!
నేడు జరిగిన వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అద్భుత విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆసిస్ కేవలం 2 లీగల్ బంతుల్లోనే 21 పరుగులు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
నేడు జరిగిన వన్డే వరల్డ్ కప్ (ODi World Cup-2023) మ్యాచ్‌లో న్యూజిలాండ్ (New Zealand)పై ఆస్ట్రేలియా (Australia) విజయం సాధించింది. హిమాచల్‌ప్రదేశ్ లోని ధర్మశాల (Dharmasala Stadium)లో ఈ మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా 388 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 383 పరుగులే చేసింది. దీంతో ఆస్ట్రేలియా విజయం సాధించింది.
ఇకపోతే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా (Australia) జట్టు కేవలం రెండు బంతుల్లోనే 21 పరుగులు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీ వేసిన రెండో ఓవర్లో ఈ ఘటన జరగడం విశేషం. హెన్రీ వేసిన రెండో ఓవర్లో మొదటి బంతిని ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ సిక్సర్‌గా బాదాడు. ఆ తర్వాత హెన్రీ నోబాల్ వేశాడు. ఆ సమయంలో బ్యార్లు ఓ పరుగు కూడా తీశారు.
దీంతో బాల్ కౌంట్ కాకుండా రెండు పరుగులు లభించాయి. ఆ తర్వాత బంతినికి కూడా హెన్రీ నోబాల్ వేశాడు. అయితే బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఆ బంతిలో సిక్సర్ బాదాడు. దీంతో బాల్ లెక్కలోకి రాకుండానే 7 పరుగులు లభించాయి. అప్పటికే సింగిల్ లీగల్ డెలివరీకి 15 రన్స్ వచ్చాయి. హెన్రీ లీగల్ బాల్ వేసినప్పటికీ బ్యాటర్ హెన్రీ మరో సిక్స్ కొట్టాడు. దీంతో కేవలం రెండు లీగల్ బంతుల్లో ఆస్ట్రేలియా 21 పరుగులు చేసింది.