»Harbhajan Who Gave The Reason For Pakistans Defeat Severely Criticized Bhajji
Pakistan ఓటమికి కారణం చెప్పిన హర్భజన్.. భజ్జీపై తీవ్ర విమర్శలు
దక్షిణాఫ్రికా చేతిలో వికెట్ తేడాతో పాక్ (PAK vs SA) ఓడిపోయి సెమీస్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా డీఆర్ఎస్ నిర్ణయాలపై మరోసారి నెట్టింట ట్రోలింగ్ మొదలైంది.
పాకిస్థాన్, సపారీలపై ఎందుకు ఓడిందన్న దాని పై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) కారణం చెప్పాడు.పాక్ జట్టు ఓటమికి బ్యాటింగ్, బౌలింగ్ కారణం కానే కాదని అంపైర్ తప్పుడు నిర్ణయంతో ఓడిందంటూ తీవ్ర విమర్శలు చేశాడు. ఐసీసీ (ICC) వెంటనే నిబంధనలు మార్చాలని కోరాడు. బంతి స్టంప్స్‌ను తాకితే అది అవుటేనని, అంపైర్ (Umpire) అవుటిచ్చాడా? లేదా? అన్న దాంతో సంబంధం లేదని పేర్కొన్నాడు. లేదంటే టెక్నాలజీ వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తూ ఎక్స్ చేశాడు. భజ్జీ విమర్శలపై సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్ గ్రేమ్ స్మిత్ (Graeme Smith) అంతే వేగంగా స్పందించాడు.
నువ్వు చెప్పింది సరే కానీ.. మరి తమ బ్యాటర్ డుసెన్ (Dusen) అవుట్ సంగతేంటని ప్రశ్నించాడు. అంపైర్లపై నీ అభిప్రాయమే నాది కూడా అని, మాదీ సేమ్ ఫీలింగ్ అని దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చాడు. 19వ ఓవర్లో ఉస్మా మిర్ వేసిన డెలివరీకి ఎల్బీ అయ్యాడు. దీనిపై డుసెన్ రివ్యూకు వెళ్లినా ఫలితం వ్యతిరేకంగా రావడంతో సైలెంట్‌గా మైదానాన్ని వీడాడు. ప్రపంచకప్(World Cup)లో వరుసగా మూడు పరాజయాల తర్వాత నిన్న దక్షిణాఫ్రికా(South Africa)తో జరిగిన మ్యాచ్‌లో పాక్ గెలుపు అంచుల వరకు వచ్చి ఓటమి పాలైంది. దేశాలతో సంబంధం లేకుండా సగటు క్రికెట్ అభిమానిని ఇది తీవ్రంగా బాధపెట్టింది.