Asian Games Update India's Neha Thakur wins silver in sailing.
Asian Games: ఆసియా గేమ్స్‌లో (Asian Games) భారత్ సత్తా చాటుతోంది. భారత్ ఖాతాలోకి మరో పతకం చేరింది. సెయిలింగ్‌లో నేహా ఠాకూర్ డింగీ – ILCA 4 విభాగంలో రెండో స్థానంలో నిలిచి దేశానికి మొదటి పతకాన్ని అందించింది. మహిళల ఐఎల్సీఏ – 4 కేటగిరీలో 11 రేసుల తర్వాత రెండో స్థానంలో నిలిచింది. మొత్తం 27 పాయింట్లను సాధించింది. థాయిలాండ్ క్రీడాకారిణి నొప్పస్సోర్న్ ఖుంబూంజన్ 16 పాయింట్లతో బంగారు పతకం, సింగపూర్‌కు చెందిన కైరా మేరీ కార్లైల్ 28 పాయింట్లతో కాంస్యం సొంతం చేసుకున్నారు. దీంతో భారత్ ఇప్పటి వరకు 12 పతకాలను కైవసం చేసుకుంది. ఇందులో రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఆరు కాంస్య పతకాలు ఉన్నాయి.
మధ్యాహ్నం 1:30 గంటలకు జూడో గేమ్ విభాగంలో తులికా మాన్ కాంస్యం కోసం పోరాడుతుంది. తరువాత రోజు వుషు స్టార్లు సూర్య భాను పర్తాప్ సింగ్, సూరజ్ యాదవ్ తమ క్వార్టర్-ఫైనల్లో పోటీ పడతారు. వీరు సెమీ-ఫైనల్‌కు చేరితే భారత్‌కు కనీసం కాంస్య పతకాలు ఖాయం. భారత పురుషుల 4×100 మీటర్ల మెడ్లీ రిలే జట్టు హీట్స్‌లో 3:40.84 సెకన్లతో జాతీయ రికార్డు సాధించి ఓవరాల్‌గా నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. షూటింగ్లో మను భాకర్ 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్లో ప్రథమ స్థానంలో ఉన్నారు. అలాగే పూల్ ఏ మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు 16-1తో సింగపూర్‌ను చిత్తుగా ఓడించింది.