నిత్యం యవ్వనంగా ఉండేందుకు అమెరికా(America)కు చెందిన వ్యాపార వేత్త వైద్యులతో కలిసి ప్రయోగాలు చేస్తున్నాడు. 46 ఏళ్ల వయసున్న బ్రయాన్ (Brayan) .. తన శరీరంలోని అవయవాల పనితీరును 18 ఏళ్ల వయసున్న కుర్రాడి అవయవాల పనిచేయాలని భావిస్తున్నాడు.ఇందుకు కోసం తన కుమారుడి బ్లేడ్ (Son blood) తన శరీరంలోకి ఎక్కించుకున్నాడు. తన హెల్త్, అవయవాల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు రకరకాల వైద్య పరికరాలను సమకూర్చుకున్నాడు.
నైట్ నిద్రించే ముందు తన శరీరానికి పలు పరికరాలను అమర్చుకుంటాడు.. అంతేకాదు రాత్రిపూట చేయాల్సిన డిన్నర్ (Dinner) రోజూ మార్నింగ్ 11 గంటలకు తింటాడట. డాక్టరుల సూచనలకు అనుగుణంగా తన డైట్ కూడా మార్చుకున్నాడు. ఇదంతా స్వయంగా బ్రయాన్ జాన్సన్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ(Interview)లో చెప్పాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వస్తే తన ఎలక్ట్రిక్ కారు(Electric car)లో గంటకు 16 మైళ్ల (25 కిలోమీటర్లు) వేగం మించకుండా వెళతానని వివరించాడు. కాగా, బ్రయాన్ జాన్సన్ నెట్ వర్త్ 400 మిలియన్ డాలర్లు ఉంటుందని ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్లూమ్ బర్గ్ (Bloomberg) ఓ కథనంలో ప్రచురించింది.ఆయన కంపెనీ బ్రెయిన్ ట్రీ పేమెంట్ సొల్యూషన్ కు ప్రజల్లో ఆదరణ పెరిగింది. దీంతో ఆ కంపెనీని 800 మిలియన్ డాలర్లకు ఈబే కంపెనీకి అమ్మేశాడు.